హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : రక్షణశాఖ ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళన చేపడుతున్న తరుణంలో వివిధ వర్గాలు కేంద్రం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉందని, అగ్నివీర్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు ఆ తీవ్రతను సూచిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో తెలిపారు.
తొలుత దేశ రైతులతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుందని, ఇప్పుడు దేశ జవాన్లతోనూ ఆడుకుంటుందని మంత్రి ఆరోపించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం నుంచి ఇప్పుడు దేశంలో నో ర్యాంక్ నో పెన్షన్ గా మారిందని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో కేంద్ర వైఖరిని విమర్శించారు.



