బిజెపిపై పోరాటం చేసేవారికి అమిత్ షా నోటీసులు
గత గ్యారెంటీలకే దిక్కులేదు..కొత్త గ్యారెంటీలపై నమ్మకం లేదు
కరువు వొస్తే బెంగళూరుకు కనీసం నీరు కూడా ఇవ్వలేదు
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బెంగళూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిందని, రేపు దేశంలో అధికారం చేపట్టడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలోని సేడం ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మోదీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటంలో కర్ణాటక నుంచి 25 ఎంపీలను గెలిపించి మోదీని గద్దె దించడానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కర్ణాటక రాష్ట్రానికి కరువు వొస్తే మోదీ ఎలాంటి సహాయం చేయలేదన్నారు. కర్ణాటకకు మోదీ ఖాళీ చెంబు తప్ప ఏమీ ఇవ్వలేదని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటుందని, రిజర్వేషన్లు అవసం మనుకుంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఈ ప్రాంతం నుంచి వొచ్చిన ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారని, మల్లికార్జున ఖర్గేకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ప్రాంత ప్రజలపై ఉందన్నారు. గుజరాత్ మోదీకి అండగా ఉన్నట్లే.. కర్ణాటక ఖర్గేకు అండగా నిలవాలన్నారు. ఈ ఎన్నికలు కర్ణాటక వర్సెస్ గుజరాత్ అని అన్నారు. బిజేపీపై పోరాటం చేసేవారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైన నాకు, గాంధీ భవన్ నేతలకు దిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారని, ఎన్నికలు వొచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
గత గ్యారెంటీలకే దిక్కులేదు..కొత్త గ్యారెంటీలపై నమ్మకం లేదు
మోదీ ఇచ్చిన గ్యారెంటీలకు దిక్కుదని, కొత్తగా ఆయన చెప్పే గ్యారెంటీలేమిటని సిఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఐదు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వమన్నారు. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసుకున్నామని చెప్పుకొచ్చారు. పదేళ్లలో మోదీ ప్రజలకు ఇచ్చిన హావ్నిలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని మోదీ మోసం చేశారన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి గుర్మిట్కల్‌లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గ్నే కలిసి ఎన్నికల ప్రచారసభలో సీఎం పాల్గొని మాట్లాడుతూ…ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఖర్గే కొనసాగారన్నారు. 1972లో మొదటిసారిగా ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే… ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు.
ఇక్కడి ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిరదన్నారు. 40 కోట్ల ఖాతాలు తెరిపించిన మోదీ…ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదన్నారు. కర్ణాటక నుంచి 26 ఎంపీలను ఇస్తే..మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఒకటే కేబినెట్ పదవన్నారు. మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఏవ్ని లేదని.. ఖాళీ చెంబు తప్ప అంటూ విరుచుకుపడ్డారు. కరువు వొస్తే కనీసం బెంగుళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. నరేంద్ర మోదీ ప్రజలను నమ్మించి మోసం చేశారని..అలాంటి మోదీని ఓడిరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని కోరారు. సమర్థులు, ప్రజల కోసం కొట్లాడే వారికే వోటు వేసి గెలిపించాలన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు ఒక్క వోటు వేస్తే… ఇక్కడున్న ముగ్గురు నాయకులు ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారన్నారు. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్‌కు వోటు వేయాలన్నారు. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ను లక్ష మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.
ఎన్నికలు వొచ్చినప్పుడల్లా బెదిరింపులు
ఇడి, సిబిఐ, ఐటి సంస్థలతో దాడులు
దిల్లీ పోలీసుల నోటీసులపై సిఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని, సోషల్ వ్నిడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైనా తనకు, గాంధీ భవన్ నేతలకు దిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్రమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ..ఎన్నికలు వొచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారని చెప్పారు. కాగా..ఈ కేసులో మే 1న హాజరు కావాల్సిందిగా దిల్లీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేసింది. ఫేక్ వీడియోపై కేంద్ర హోమ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు దిల్లీ పోలీసులు హైదరాబాద్ చ్చి నోటీసులుల జారీ చేశారు.
బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా.. తెలంగాణలోని ఓ బహిరంగ సభలో రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు.. ఆ వీడియోను ఎడిటింగ్ చేసి.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం అన్న అర్థం వచ్చేలా వీడియో రిలీజ్ అయ్యిందని.. అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ వ్నిడియాలో సర్క్యులేట్ అయ్యిందని.. దీంతో నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు దిల్లీ పోలీసులు. దిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు వొచ్చిన దిల్లీ పోలీసులు..కాంగ్రెస్ సోషల్ వ్నిడియా ఇంచార్జ్ మన్నె సతీష్‌కు సీఆర్పీసీ 91 ప్రకారం నోటీసులు ఇచ్చారు. అమిత్ షా వీడియో ఎడిట్ చేసి వైరల్ చేసినందుకు తెలంగాణ బీజేపీ నేతలు కూడా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిల్లీలో స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరికి సమన్లు పంపారు. మే 1న విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు.




