సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 18 : తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి వేతనాలు అందిస్తున్నారు. గత ప్రభుత్వాలలో 500, 1000 కూడా లేని వేతనాలను గ్రామాల్లో కార్మికులు గౌరవంగా బ్రతకాలనే ఉద్ధేశ్యంతో అడగకుండానే 8 వేల 500 రూపాయలకు పెంచారు.అలాగే ఈ మధ్యే 8500 నుండి 9 వేల 500 కి పెంచిన మనసున్న మనిషి కేసీ.ఆర్ బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో కనీసం మనషులుగా కూడా చూడట్లేదు ఆ ప్రభుత్వాలు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లో 5 వేl 200ఆంద్రప్రదేశ్ లో మన పక్కరాష్ట్రం- 6 వే లు చత్తీస్ ఘడ్ లో అసలు ప్రభుత్వము వేతనమే ఇవ్వటం లేదు.గ్రామపంచాయతీలే తోచినంత ఇస్తున్నాయి.ఒరిస్సాలో ఇంటికి 5 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు.పశ్చిమ బంగాల్ లో అయితే పెయిడ్ వర్కర్స్’ అని పెట్టి నెలకు కేవలం 500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు.కేరళ లాంటి రాష్ట్రంలో కూడా సానిటేషన్ వర్కర్లు అనిపెట్టి ఇంటికి కేవలం 30 రూపాయలు ఇస్తున్నారు.అంటే ఒక కార్డులో పనిచేస్తే కనీసం 4 నుండి 5 వేలు కూడా రాని పరిస్థితి.దేశమంతా ఇలాంటి పరిస్థితులు ఉంటే.మన ముఖ్యమంత్రి పల్లె ప్రగతి లాంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని మన పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచేట్లు చేశారు. గ్రామపంచాయతీల సెక్రటరీలు, మల్టిపర్పస్ వర్కర్ల పాత్ర మరువలేనిది అని తెలిసె వారిని అన్ని విధాలుగా గౌరవంగా చూసుకుంటున్న ప్రభుత్వం – తెలంగాణ మాలిన రాజకీయాలు చేసే కొన్ని పార్టీల ఉచ్చులో పడోద్దని ముఖ్యమంత్రి మిమ్మల్నందరిని చల్లగా చూస్తారని, ఎలాంటి సమ్మెలు, ధర్నాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ పల్లెలకున్న గొప్ప పేరును ఖరాబు చేయొద్దని వేడుకుంటున్నాను. అలాగే కొంతమంది క్వాలిఫైడ్ కార్మికులు అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి’గా గుర్తింపునివ్వాలని కోరడం జరిగింది. అదికూడా మంత్రి హరీష్ రావు ద్వారా ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకవెల్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాముని ఉమేష్, అర్భన్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు యాదగిరి, యువజన నాయకుడు కనకరాజు, తదితరులు పాల్గొన్నారు.




