దేశంలో ఆగని కొరోనా కేసుల పెరుగుదల

తాజాగా 17,073 మందికి పాజిటివ్‌
‌న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌దేశంలో కోవిడ్‌ ‌కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 17 వేల మర్కు దాటాయి. ఇక ఆదివారం 3.03 లక్షల మందికి కొరోనా టెస్టులు చేయగా..దేశవ్యాప్తంగా కొత్తగా 17,073 కొరోనా కేసులు నమోదయ్యాయని తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటి ంచింది. అదే సమయంలో కరోనా కారణంగా 21 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 4,34,07,046 కు, మరణాల సంఖ్య 5,25,020కు చేరినట్టు ఆరోగ్య శాఖ వెల్లడి ంచింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టివ్‌ ‌కరోనా కేసులు 94,420,గా ఉన్నాయని తెలిపింది. దేశంలో ఆదివారం నాటికి 1,97,11 ,91 ,329 టెస్టులు చేశారు. కాగా, దేశంలో యాక్టివ్‌ ‌కేసుల రేటు 0.21 శాతానికి పెరగ్గా.. రిక వరీ రేటు 98.58 శాతానికి పడి పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *