ప్రపంచంలో రష్యా, చైనా తర్వాత ములుగులో నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం
పర్యావరణం, అటవీ సంరక్షణపైన సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి
సకల సౌకర్యాలు, అన్ని హంగులతో ఫారెస్టట్ కాలేజ్ యూనివర్సిటీగా రూపాంతరం అసెంబ్లీ ఆమోదం తర్వాత పాలనాపరమైన నిర్ణయాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబర్ 27 : సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు రాష్ట్రంలో ఫారెస్ట్ కాలేజీ్ర రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎఫ్‌సిఆర్‌ఐ) ను 2016లో నెలకొల్పారు. ఇప్పడు అదే కాలేజీ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ అవుతున్నది. హైదరాబాద్ సమీపంలో ములుగు వద్ద అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక భవనాలతో పాటు అటవీ విద్యకు అవసరమైన అన్ని హంగులతో ఇప్పటికే క్యాంపస్ సిద్ధంగా ఉంది. 2016 లో మొదట దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో ప్రారంభమైన కాలేజీ, ముఖ్యమంత్రి చొరవతో హైదరాబాద్ సమీపంలో ఉన్న ములుగు క్యాంపస్‌కు మారింది. దేశంలోని ఏ యూనివర్సిటీ, కాలేజీ క్యాంపస్‌లకు తీసిపోని విధంగా, సర్వహంగులు, ఆధునిక సౌకర్యాలతో ఫారెస్ట్ కాలేజీ కొనసాగుతోంది. ఇప్పుడు యూనివర్సిటీగా మార్పుతో ఇదే ఫారెస్ట్ కాలేజీ, దేశంలోనే మొదటి ఫారెస్ట్ యూనివర్సిటీగా మారబోతున్నది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పాలన, నియామకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
అంతర్జాతీయంగా పర్యావరణ మార్పులు, జీవవైవిధ్యానికి పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అటవీ విద్యపై ప్రత్యేక దృషి్ట పెట్టింది. అలాగే ఈ క్యాంపస్ నుంచే జాతీయ స్థాయి పర్యావరణ నిపుణులు, అఖిల భారత స్థాయి అధికారులు రావాలనేది సిఎం ఆకాంక్ష. అందుకు తగినట్లుగానే మొదటి బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు బీఎస్సీ ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన విద్యార్థులు అటు అమెరికా యూనివర్సిటీలతో పాటు, దేశంలోనే పేరెన్నికగల డెహ్రాడూన్ ఫా•రెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఐకార్ లాంటి చోట్ల ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇటీవలే ఒక విద్యార్థి ఐఎఫ్‌ఎస్ కూడా సాధించారు.
ముఖ్యమంత్రి ఓఎస్డీగా(హరితహారం) మొదటి నుంచి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక వర్గీస్, ఫారెస్ట్ కాలేజీ డీన్‌గానూ కొనసాగుతున్నారు. తన పర్యవేక్షణలో కాలేజీ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించటంతో పాటు, ఇప్పుడు దేశంలోనే మొదటి ఫారెస్ట్ యూనివర్సిటీగా మారబోతోంది. పచ్చదనం పెంపు, పర్యావరణహిత రాష్ట్రం కోసం తెలంగాణకు హరితహారం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి, చాలా ముందుచూపుతో ఫారెస్టట్ కాలేజీని నెలకొల్పారని, ఇప్పుడు యూనివర్సిటీగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేయటం గొప్ప విషయమని ప్రియాంక వర్గీస్ అన్నారు. అటవీ విద్యకు ప్రాధాన్యత పెరగటంతో పాటు, గ్రామీణ యువతకు మంచి అవకాశాలు దక్కుతాయన్నారు.

అటవీ విశ్వవిద్యాలయానికి శాసనసభ, శాసన మండలి ఆమోదం తెలిపింది. దేశ అటవీ విద్యలో ఇది చారిత్రాత్మక ఘట్టం. ఈ నేపథ్యంలో ఫారెస్ట యూనివర్సిటీ ప్రత్యేకతలు :
‘‘అటవీ విశ్వవిద్యాలయము (యూఓఎఫ్), తెలంగాణ చట్టం, 2022’’ దేశంలోనే మొట్ట మొదటిది. ప్రపంచంలో మూడవ అటవీ యూనివర్సిటీ. రష్యా, చైనా తర్వాత మూడవది భారత దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ (ఎఫ్‌ఆర్‌సిఐ)ని అటవీ విద్య, పరి శోధన, విస్తరణ మరియు ఫలితాలను ప్రజలకు చేరువ కావడం కోసం ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని నిర్ణ యించింది.

ఈ దిశగా, అటవీ కళాశాల • పరిశోధన సంస్థ, హైదరాబాద్‌ను పూర్తి స్థాయి ‘‘అటవీ విశ్వ విద్యాలయం(యూఓఎఫ్)’’ గా ఈ క్రింది అంశాలతో ప్రత్యేక చట్టం ద్వారా రూపొందించాలని ప్రతిపాదించబడింది :
అటవీ వనరుల సంరక్షణ- స్థిరమైన నిర్వహణ కోసం అర్హత కలిగిన అటవీ నిపుణులను తయారు చేయడం. పరిశోధనలను ప్రోత్సహించడం- చెట్ల పెంపకానికి తగిన పద్ధతులను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమలు మరియు ప్రజల అవసరాలు తీర్చడం. వివిధ వ్యవసాయ-పర్యావరణ పరిస్థితులకు అనువైన వ్యవసాయ-అటవీ నమూనాలను అభివృద్ధి చేయడం, సంప్రదాయ అటవీ కార్యకలాపాలే కాకుండా, సహజ అడవులపై ఒత్తిడిని తగ్గించడం, వ్యవసాయ వర్గాల ఆర్థిక అభివృద్ధి మరియు పర్యావరణ పరిస్థితులను పెంపొందించడం. సారూప్య సంస్థలతో అనుబంధం మరియు భాగస్వామ్యం ద్వారా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం. పరిశోధనా ఫలితాలను రైతులకు విస్తరణ శిక్షణ ద్వారా అందించడాన్ని ప్రోత్సహించడం.

‘‘అటవీ విశ్వవిద్యాలయం(యూఓఎఫ్), తెలంగాణ’’ స్థాపన అటవీ శాఖ అవసరాలకు అను గుణంగా శిక్షణ పొందిన అటవీ నిపుణులను తయారు చేస్తుంది. అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థను యూనివర్శిటీగా రూపొందించిన తర్వాత అదనంగా పీహెచ్‌డి కోర్సులు, పట్టణ అటవీ వనాలు, నర్సరీ మేనేజ్మెంట్, అగ్రో ఫారెస్ట్రీ, గిరిజన జీవనోపాధి పెంపుదల, ఫారెస్ట్ ఎంట్రప్రెన్యూవర్‌షిప్, క్లైమేట్స్ ట్రాన్స్‌ఫారెస్రీ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ డిప్లొమా మరియు సర్టిఫికేట్ కోర్సులు ప్రారంభించడానికి నిర్ణయిం చడమైనది. ఫలితంగా, విద్యార్థుల ప్రస్తుత సంఖ్య 366 కు అదనంగా 360 పెరిగి 726 కి చేరుతుంది. ఉద్యోగుల సంఖ్య ప్రస్తుత సంఖ్య 118 కు అదనంగా 92 పెరిగి 210 కి చేరుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి విశ్వవిద్యాలయానికి ఛాన్స్‌లర్‌గా ఉంటారు. ఛాన్సలర్ వైస్ చా•న్సలర్‌ను నియమిస్తారు.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ విధానాల ద్వారా హరితవనాలను పెంపొందించడానికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం ‘‘తెలంగాణకు హరితహారం’’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇది ప్రభుత్వం యొక్క అత్యంత విజయవంతమైన కార్యక్రమాలలో ఒకటి మరియు భారత దేశం నలుమూలల నుండి, విదేశాల నుండి విస్తృతమైన ప్రశంసలు పొందింది. శిక్షణ పొందిన, అర్హతలు కలిగిన అటవీ నిపుణుల లభ్యత ఈ బృహత్తర కార్యక్రమాన్ని చాలాకాలం పాటు విజయవంతం చేయడంలో దోహదపడుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ‘‘తెలంగాణకు హరిత హారం’’ కార్యక్రమం క్రింద ఇప్పటి వరకు 268.83 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా ప్రభుత్వం యొక్క నిరంతర కృషి కారణంగా, రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతం మరియు అటవీ విస్తీర్ణం 6.85 శాతం పెరిగింది.