ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9: ఆమనగల్లు పట్టణంలోని సర్వే నెంబర్ 1457 , 1459 లోని విద్యానగర్ కాలనీవాసులకు గత 7 సంవత్సరాలుగా దేవాదాయ శాఖ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఇండ్లు, ప్లాట్లు, ఉన్నవారికి విముక్తి లభించిందని విద్యానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎమ్ ఏ. పాషా తెలిపారు. దీనికి సంబంధించి వివరాలను కాలనీ కార్యవర్గ సభ్యులతో కలిసి వివరించారు. గతంలోనే టైటిల్ కలిగిన అన్నింటినీ విద్యానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాషా, కార్యవర్గ సభ్యుల నిరంతర కృషి వల్ల ప్రభుత్వ దేవాదాయ శాఖ, రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఇంత మహత్తర కార్యక్రమాన్ని సాధించడానికి నైతిక బలాన్ని తమ సహాయ సహకారాలు అందించిన విద్యానగర్ కాలనీ సంక్షేమ సంఘం కార్యవర్గానికి సభ్యులకు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాషా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సర్వే నెంబర్ 1457&1459 నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు కొనసాగించుటకు మరియు నిర్మాణ అనుమతులు ఇల్లు నిర్మించుకొనుటకు అవకాశం కల్పించాలని మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, సబ్ రిజిస్ట్రార్ మహేశ్వరం కార్యాలయంలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వర్కాల శేఖర్, సెక్రటరీ జంగయ్య, కోశాధికారి సుదర్శన్ రెడ్డి, కమిటీ ముఖ్య సలహాదారు పాండు, కమిటీ సభ్యులు మ్యాక వేంకటేశ్వర రెడ్డి, పర్వతాలు పాల్గొన్నారు.
దేవుని మాన్యం నుండి విముక్తి పొందిన ఆమనగల్లు విద్యానగర్ కాలనీ వాసులు





