లాటరీ దక్కెంత అదృష్టం
ఇవ్వలేదు కానీ!
టిక్కెట్టు కొనేంత అవకాశం
నాకు ఇచ్చాడు.!
ఆకాశాన్ని మోసేంత శక్తి
ఇవ్వలేదు కానీ!
అంబరం కాంచేంత కన్నులు
నాకు ఇచ్చాడు
వేదాంతాన్ని వల్లించే భాషణం
ఇవ్వలేదు కానీ
మంచిని పలికే మాట
నాకు ఇచ్చాడు
మహత్యం చేసే చేతులు
ఇవ్వలేదు కానీ
మానవత్వం చూపే చేతలు
నాకు ఇచ్చాడు
పంచ భక్ష్య పరమాన్నాలు
ఇవ్వలేదు కానీ
పచ్చడి మెతుకులను
నాకు ఇచ్చాడు
ఆశావాది పైనుండి క్రిందకు
కృతజ్ఞతతో!!!
నిరాశావాది క్రింద నుండి పైకి
కృతఘ్నతతో!!!
దేముడికో విన్నపం!
-ఉషారం
9553875577





