నిదుర నిండని కళ్ళల్లో
పరుగులెత్తే కలలు దేనికో..
హృదయం నిండా లేని
రూపానికి పై పై నగిషీలు దేనికో..

మౌనం మాటున
దాగిన గానానికి వినిపించని రాగాలెందుకో..
నీలువ నీడలేని
ప్రాంతంలో వ్యాపారాలకై ఆతృత దేనికో..

దళారీ వ్యవస్థ ఉన్న నేటి సమాజంలో
రైతన్న మీద ఎందుకూ ఉపయోగ పడని  గౌరవం దేనికో..

అత్యంత ధనవంతులు కలిగిన
దేశంలో పేదవాడి ఆకలి కేకలు దేనికో..

బడా వ్యాపారులకు అప్పులు ఇచ్చి వాళ్లు కట్టకపోతే మాఫీ చేసే బ్యాంకులు..
సామాన్యుడు  కొన్ని నెలలు ఈఎంఐ  కట్టకపోతే  ఇంటి మీదకి వచ్చి చేసే దాడి దేనికో..

పెద్ద పెద్ద వ్యాపారులకు
ఎర్ర తివాచీ పరిచి రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు..
చిన్న వ్యాపారుల మీద వడ్డించే పన్నులు దేనికో..
– ఏడుకొండలు కళ్ళేపల్లి, మచిలీపట్నం, 9490832338

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *