దూసుకుపోతున్న ఆదిత్య

బెంగళూరు,సెప్టెంబర్‌7 : ఆదిత్య ఎల్‌1 ‌మిషన్‌ ‌లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. సూర్యుడి రహ్యస్యాలు చేధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇటివల రోదసిలోకి ఆదిత్యను పంపించిన సంగతి తెలిసిందే. భూమి నుంచి 15 లక్షల కిలోటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్‌ ‌పాయింట్‌ ‌దిశగా అది పయనిస్తోంది. అయితే అందుకు దాదాపు 4 నెలల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రయోగించిన తొలి 16 రోజులు భూకక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనుంది. ప్రస్తుతం భూకక్ష్యలోనే తిరుగుతున్న ఆదిత్య ఎల్‌1 అద్భుతమైన ఫొటోలను తీసింది. ఆదిత్య ఎల్‌1 ‌మిషన్‌ ఒక అదిరిపోయే సెల్ఫీ తీసుకుంది. ఇందులో ఎల్‌1 ‌మిషన్‌ ‌కనిపించింది. ఇక మరో అత్యధ్బుతమైన ఖగోళ దృశ్యాన్ని ఆదిత్య ఎల్‌1 ‌మిషన్‌ ‌బంధించింది.

ఇందులో ఒకే ఫొటోలో భూమి, చంద్రుడు కూడా ఉండడం విశేషం. సెప్టెంబర్‌ 4‌న భూమి, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉన్న సమయంలో ఈ ఫొటో తీసింది. దీంతో ఒకే ఫ్రేమ్‌లో ఈ రెండూ కనిపిం చాయి. ఈ ఫొటో ఖగోళ ఔత్సహికులతోపాటు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆదిత్య-ఎల్‌1 ‌మిషన్‌: ‌చూస్తోంది!. సూర్యుడు-భూమి ఎల్‌1 ‌పాయింట్‌ ‌లక్ష్యంగా దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్‌1 ఒక సెల్ఫీ తీసుకుంది. భూమి, చంద్రుడి చిత్రాలు కూడా తీసింది‘ అంటూ ఇస్రో ఒక వీడియోను షేర్‌ ‌చేసింది.కాగా ఆదిత్య ఎల్‌1 ‌మిషన్‌ ‌శాటిలైట్‌లో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్‌, ‌క్రోమోస్పియర్‌తో పాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులతో పాటు అక్కడి వాతావరణం గురించి ఇవి శోధించనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *