ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 19 : తలకొండపల్లి మండలం మాధాయపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలో భాగంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించిన యజ్ఞ కార్యక్రమాలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ మూజీబూర్ రహేమాన్, నాయకులు దశరథం, విజయ్ కుమార్, గోవర్ధన్ గౌడ్, శేఖర్, రాజు గుప్తా, సుధాకర్, మాదవులు, రామస్వామి, సత్యం, శ్రీను, చెన్నయ్య, ప్రహ్లాద్ గౌడ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు..
దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్




