దుర్గామాతను దర్శించుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశిరెడ్డి రవీందర్ రెడ్డి

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: జగదేవపూర్ మండల పరిధిలోని లింగారెడ్డి పల్లి గ్రామంలో దుర్గ యుత్, గ్రామ పెద్దల ఆశీస్సుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్యతిధి గా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కేశి రెడ్డి రవీందర్ రెడ్డి, రాష్ట్ర బిసి రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలoలోని గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో అష్ట ఆయురారోగ్యాలతో  ఉండాలని అన్నారు. దుర్గ మాత ఆశీస్సులు అందరి పై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ కనక లక్ష్మి చంద్రం, ఉప సర్పంచ్ తీగుళ్ల బాలకిషన్,హనుమంత్ రెడ్డి,గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు సుధాకర్,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *