ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 19 : దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం కడ్తాల మండలం చల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గమాత అమ్మవారిని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టీ. ఆచారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కండే హరిప్రసాద్, బిజెపి ముఖ్యనాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
దుర్గామాతకు పూజలు చేసిన ఆచారి





