పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: దేవి శరన్నవరాత్రుల ను పురస్కరించుకొని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాలను మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయా మండపాల నిర్వాహకులు చైర్మన్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ, దసరా పండగలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఇప్పటికే ఆయా చెరువుల వద్ద బతుకమ్మ ఘాట్ లను సిద్ధం చేసినట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, వార్డు కౌన్సిలర్స్ , కో ఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దుర్గాదేవి మండపాలను దర్శించుకున్న అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి





