దుఖ:సంద్రంలో మొండ్రాయి గిర్నితండ..

  • పోలీస్‌ ‌పహారా నడుమ ప్రీతి అంత్యక్రియలు
  • నా కూతురిది ఆత్మహత్య కాదు హత్య
  • సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ చేపట్టాలి
  • విలిపిస్తు విన్నవించిన ప్రీతి తండ్రి నరేందర్‌
  • ‌ప్రీతి మృతిపై పూర్తి స్థాయలో విచారణ
  • రూ. 30 లక్షలు ఎక్స్‌గ్రేషియా
  • ఒకరికి ఉద్యోగం
జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: కూతురు వైద్య విద్యలో రాణించి పది మందికి సేవలందిస్తు కుటుంబానికి అండగా నిలబడుతుందని సంబరపడి ఎన్నో కలలు కన్న తల్లితండ్రులకు కలలు కల్లలుగానే మిగిలిపోయాయి.కష్టమైన ఆర్దిక నష్టమైన కన్నకూతురు కల నెరవేర్చందుకు పడిన తపన ఆతల్లితండ్రులకు ఆఖరికి దుఖ్నాన్ని మిగిల్చింది.వైద్య వృత్తిలో రాణించి నలుగురికి సేవలు చేస్తు కన్న తల్లితండ్రులకు, పుట్టిన ప్రాంతానికి పేరు తెస్తుందని ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ తల్లితండ్రులకు నరరూప రాక్షసుడి ర్యాగింగ్‌కు కూతురు(ప్రీతి) జీవితాన్ని కడతేర్చిందని ఆ తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి.ఆఖరికి కడసారి చూపునైన కళ్లార చూడకుండా పోలీస్‌ ‌పహార మధ్య దహనం చేయాల్సిన దుస్దితి వచ్చిందని ఆ తల్లితండ్రులు దుఖించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.దీంతో సోమావారం మొండ్రాయి గిర్నితండా సోఖసంద్రంలో మునిగింది.కాకతీయ మెడికల్‌ ‌కాలేజీలో వైద్య విద్యనభ్యసిస్తున్న ధారావత్‌ ‌ప్రీతి నరరూప రాక్షసుడి ర్యాగింగ్‌కు బలైన విషయం విధితమే.
ఎంతో మంది ప్రాణాలను వైద్యమందించి కాపాడవలిసిన ప్రీతి ర్యాగింగ్‌ ‌భూతానికి బలికావాల్సి వచ్చిందని విలపించారు.కాలేజీ యాజమాన్యానికి విషయాన్ని వివరించిన కానీ చర్యలు చేపట్టకపోవడం ప్రీతి ప్రాణం బలికావల్సి వచ్చింది.వైద్య విద్యార్దినికే ఇంతటి దుస్దితి ఏర్పడితే మామూలు చదువుల పరిస్దితి ఏంటని సభ్యసమాజం ముక్కున వేలేసుకుంది.జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాకు చెందిన ధరావత్‌ ‌నరేందర్‌ ‌శారద దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడున్నారు.పిల్లల చదివే ప్రదానమని భావించిన నరేందర్‌ ‌దంపతులు ఉన్నత విద్యనందించేందుకు వృత్తిరీత్యా వరంగల్‌లో ఉంటున్నారు.ఎన్ని కష్టనష్టాలు ఎదిరొచ్చి తన పిల్లలకు ఉన్నత విద్యనందిస్తున్నారు.
చిన్న కూతురైన ప్రీతి చదువులో మొదటి నుండి మంచి మార్కులు సాధించేది.దీంతో కూతురు కోరిక మేరకు వైద్య విద్యను చదివిస్తున్న తరుణంలోనే ర్యాగింగ్‌ ‌భూతానికి బలికావాల్సి రావడం ఆతల్లితండ్రులను దుఖసంద్రంలో ముంచింది.ఆస్పత్రిలో వైద్యం పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందగా సోమవారం తెలతెల్లవారంగా స్వగ్రామమైన మొండ్రాయి గిర్నితండాకు పోలీస్‌ ‌పహారాలో ప్రీతి మృతదేహాన్ని తరలించడంతో గ్రామప్రజలందరు శోకసంద్రంలో మునిగారు.విగతజీవిగా మారిన తమ కూతుర్ని చూసి ఆ తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి.వారి ఆర్తనాదాలు చూపరులను కంటతడి పెట్టించాయి.డీసీపీ సీతారాం ఆద్వర్యంలో ఏసీపీ, సీఐ, ఎస్సైలు భారీ బందోబస్తును చేపట్టారు.ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బలగాలను మోహరించారు.ప్రజాసంఘాలను రానివ్వకుండా చర్యలు చేపట్టారు.ఆఖరికి పోలీస్‌ ‌పహారాలో మధ్య దహన సంస్కారాలను జరిపించారు.దీంతో పలువురు నాయకులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తామని హామిచ్చారు.
నా బిడ్డది ఆత్మహత్య కాదు హత్య తండ్రి నరేందర్‌…
image.png‌నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు.ఆత్మహత్య కాదు ముమ్మాటికి హత్యనే కాలేజీ ప్రిన్సిపల్‌, ‌హెచ్‌వోడీలకు పిర్యాదు చేసిన పట్టించుకోలేదు.వారందరు కలిసి నా కూతరును హత్య చేసారు.ని•నిజాలను వెలికి తీసేందుకు వారిని ఉద్యోగంలో నుండి తొలగించి సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించి నా కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి.
గిరిజన బిడ్డకు గౌరవమేది…మందకృష్ణమాదిగ
ర్యాగింగ్‌ ‌భూతానికి బలైన గిరిజన బిడ్డకు గౌరవమేది.ఉన్నత కుటుంబాల పిల్లల ప్రాణాలు పోతే ఎన్‌కౌంటర్లు వెంటనే అరెస్టులు చేసే ఈ పాలకులు గిరిజన ప్రాణాలు పోతే పట్టించుకోరా.ప్రజా సంఘాలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి గిరిజన బిడ్డకు పోలీసులకు దహనం చేసే దుస్దితి భాదాకరం.వెంటనే సంబందిత అధికారులను తొలగించి సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించి దోషులను శిక్షించాలి.ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం…కాంగ్రెస్‌, ‌బిజెపి నాయకులుప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని కాంగ్రెస్‌ ‌జిల్లాధ్యక్షులు జంగా రాఘవరెడ్డి పలువురు నాయకులు, బిజెపి జిల్లాధ్యక్షులు దశమంతరెడ్డి, రవీంద్రనాయక్‌, ‌ధర్మారావుతో పలువురు నాయకులు వేరువేరుగా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేసి మాట్లాడారు.ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ దుస్సంఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.వెంటనే దోషులను శిక్షించాలని డిమాండ్‌ ‌చేశారు.న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని హామిచ్చారు.
ప్రీతి మృతిపై పూర్తి స్థాయలో విచారణ
– రూ. 30 లక్షలు ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
ఫైనల్‌ ‌పీజీ విద్యార్తిని డా।। ప్రీతి మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని , సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు  ప్రతీ తండ్రికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదే కాకుండా రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది.
 సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ
హెచ్చార్సీలో ఫిర్యాదు చేసిన ఓయూ జెఎసి
నిరసన ప్రదర్శన చేపట్టిన బజరంగ్‌ ‌దళ్‌
‌హైదరాబాద్‌‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి27: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కేసులో మరో ట్విస్ట్ ‌తెరపైకి వచ్చింది. ప్రీతిది ఆత్మహత్యా లేక హత్యనా అనే అనుమానాలపై విచారణ చేయాలని ఓయూ జేఏసీ  కోరింది. ఈ విషయం పై హెచ్‌ఆర్‌సీని ఓయూ జేఏసీ ఆశ్రయించింది.  ప్రీతి మృతిపై సిట్టింగ్‌ ‌జడ్జ్  ‌చేత విచారణ జరిపించాలని సురేష్‌ ‌యాదవ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. మెడికో విద్యార్థిని ప్రీతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని సోమవారం హెచ్‌ఆర్సీలో ఓయూ జేఏసీ పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ప్రీతి మృతదేహానికి జూనియర్‌ ‌డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొంది. నిమ్స్, ‌గాంధీ ఆస్పత్రిలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విచారణ చేయాలని హెచ్‌ఆర్‌సీని ఓయూ జేఏసీ కోరింది.
ఈ సందర్భంగా ఓయూ జేఏసీ నేత సురేష్‌ ‌యాదవ్‌ ‌మాట్లాడుతూ… మెడికో విద్యార్థిని ప్రీతి మృతిపై మానవ హక్కుల కమిషన్‌ ‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రీతి కుటుంబాన్ని డీసీపీ జోయల్‌ ‌డెవిస్‌  ‌తీవ్రంగా ఇబ్బందులు పెట్టారన్నారు. గాంధీలో నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను అనుమతించలేదని తెలిపారు. ప్రీతి మృతదేహానికి సీనియర్‌ ‌డాక్టర్స్ ‌చేత పోస్టుమార్టం చేయించలేదన్నారు. జూనియర్‌ ‌డాక్టర్స్ ‌చేత పోస్టుమార్టం చేయించారని మండిపడ్డారు. ఉగ్రవాదుల మాదిరిగా పోలీసులు వ్యవహారించారని అన్నారు. ప్రీతిని తరలిస్తున్న అంబులెన్స్‌లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్‌లో తన నివాసంలో ఆపాలని కుటుంబ సభ్యులు కోరినా పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. ఇదిలావుంటే సీనియర్ల ర్యాగింగ్‌ ‌భూతానికి బలైన ధరావత్‌ ‌ప్రీతి మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం, కాకతీయ మెడికల్‌ ‌కళాశాల వైఫల్యం వల్లనే ప్రీతి మృతి చెందిందని బజరంగదళ్‌ ‌నాయకులు కూకట్‌పల్లి వై జంక్షన్‌లో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు దగ్దం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రీతి ఫిర్యాదు చేసిన సమయంలో వైద్య కళాశాల సిబ్బంది, పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని ఆరోపించారు. స్థానిక నాయకుల నుండి రాష్ట్ర నాయకుల వరకు పోలీసులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని వారి విధులను నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కళాశాలలో ఇదే తంతు కొనసాగుతుందని.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన బుద్ధిని మార్చుకోక పోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడతామని బజరంగదళ్‌ ‌నాయకులు హెచ్చరించారు.
 సకాలంలో స్పందించలేదు
అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి: జీవన్‌ ‌రెడ్డి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి27: పీజీ విద్యార్థి ప్రీతి  ర్యాగింగ్‌కు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి  తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. సోమవారం డియాతో మాట్లాడుతూ… సకాలంలో కాలేజ్‌ ‌యాజమాన్యం, పోలీసులు
స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. తండ్రి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పోలీసులు చర్య తీసుకోలేదని మండిపడ్డారు.
వేధించిన వారిని మందలించి ఉంటే ఈ ఘోరం జరగేది కాదని అన్నారు. ప్రీతి మరణం విషయంలో మ్టటెవాడ పోలీస్‌ అధికారి, కాలేజ్‌ ‌ప్రిన్సిపాల్‌, ‌హెచ్‌.‌వొ.డిని నిందితులుగా చేర్చాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కేసును సిట్‌ ‌విచారణ జరిపించాలన్నారు. రక్షిత అనే ఇంజనీరింగ్‌ అమ్మాయి కూడా వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఈ కేసులో కూడా భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలని అన్నారు. రెండు, మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని జీవన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.
వరంగల్‌ ‌కేఎంసీ వద్ద పరిస్థితి ఉద్రిక్తం
ప్రీతి మరణంతో ఎబివిపి ఆందోళన
అడ్డుకుని విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
వరంగల్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి27: వరంగల్‌ ‌కేఎంసీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకతీయ మెడికల్‌ ‌కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ధారావత్‌ ‌ప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నేడు తెలంగాణ వ్యాప్తంగా మెడికల్‌ ‌కళాశాలల బంద్‌కు ఏబీవీపీతో పాటు ఓయూ జేఏసీ పిలుపునిచ్చాయి. ప్రీతి మృతికి కారణమైన సైఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్‌ ‌చేసారు.. విద్యార్థులను అరెస్ట్ ‌చేసేందుకు పోలీసులు యత్నించగా స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల తీరుపై ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐదు రోజలుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో మృత్యువుతో చేస్తున్న పోరాటంలో ప్రీతి ఓడిపోయింది. డాక్టర్ల బృందం చివరి నిమిషం వరకు ఎంత ప్రయ త్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆదివారం సాయంత్రం ఆమె కన్ను మూసింది. ప్రీతి మృతితో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆమె మరణవార్తతో కేఎంసీలోని వైద్య విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎంజీఎం ఆస్పత్రిలోనూ సీనియర్‌ ‌డాక్టర్లు, పీజీలు, హౌస్‌సర్జన్లు సైతం విషాదంలో మునిగిపోయారు. సోమవారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన వెంటనే ప్రీతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం..మొండ్రాయి గిర్నితండాకి తరలించారు. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రీతి మృతికి కారకులపై చర్యలు
మావోయిస్ట్ ‌కార్యదర్శి వెంకట్‌ ‌డిమాండ్‌
‌జయశంకర్‌ ‌భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి27: మెడికో ప్రీతి మృతికి కారకులైనవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మావోయిస్టులు డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు జయశంకర్‌, ‌మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌పెద్దపల్లి డివిజన్‌ ‌మావోయిస్ట్ ‌పార్టీ  కార్యదర్శి వెంకట్‌ ‌సోషల్‌ ‌డియాలో లేఖ విడుదల చేశారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారని చెబుతున్న ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నాయని మండిపడ్డారు. వరంగల్‌ ‌లో వైద్య విద్యార్థిని ప్రీతిని సీనియర్‌ ‌సైఫ్‌ ‌ర్యాగింగ్‌ ‌చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నా యాజమాన్యం  ఆ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని వెంకట్‌ ఆరోపించారు.
ప్రీతికి న్యాయం చేయాలని విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే ఆమె ఆత్మహత్యకు సైఫ్‌ ‌కారణం కాదని హాస్పిటల్‌ ‌యాజమాన్యం బుకాయిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఆఫీసుల్లో మహిళలపై వేధింపులు, కాలేజీల్లో ర్యాగింగ్‌ ‌నిత్యకృత్యమయ్యాయని ఫలితంగా మహిళలు ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని వెంకట్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళలంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *