దీవి శరన్నవరాత్రి ఉత్సవాలకు చేయూత

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ రూ. 35 వేల అందజేశారు. పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో తుల్జా భవాని మాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నందున ఆలయ కమిటీ సభ్యులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ మంగళవారం తన నివాసంలో సభ్యులకు రూ.35 వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ తుల్జా భవాని మాత  ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజు ,అంజిలప్పఎం. శ్రీనివాస్, గోపాల్, తులసిరాం, ప్రభాకర్ ,ఆశప్ప,పారేష్ ,జిల్ పాషా,తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *