ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ కు ముందు ప్రకటించిన దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి, రైతుబంధు లాంటి పథకాలను నిలుపుదల చేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయడంపై దీనికి నిరసనగా గురువారం ఆమనగల్లు పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నేనావత్ పత్య నాయక్ ఆధ్వర్యంలో మణిక్ రావు ఠాక్రే దిష్టిబొమ్మను ఆమనగల్లు పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి బి ఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారని గ్రహించిన కాంగ్రెస్ పెద్దలు దీనికి భయపడి కాంగ్రెస్ అధిష్టానం ఇలాంటి చర్యలకు పూలుకుంటుందని అన్నారు. తెలంగాణలో కెసిఆర్ రైతన్నలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ తప్పుదోవ పట్టిస్తుందని ఆయన ఆరోపించారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ రైతులకు ఇస్తే చాలు అంటున్నారని కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇందులో ఏది కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి అనురాధ, పార్టీ అధ్యక్షులు అర్జున్ రావు పాల్గొన్నారు
దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు





