దిశలేని పథకం అగ్నిపథ్‌

‌యువతకు అండగా కాంగ్రెస్‌ ఉం‌టుంది
అహింసా పద్దతిలోనే పోరాట ఉండాలి
యువతకు సోనియా భరోసా

న్యూ దిల్లీ ,జూన్‌18: ‌కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌స్కీమ్‌కు దిశలేదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా ఆస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. యువత స్వరాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా ఆ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. ఆర్మీ ఉద్యోగం ప్రయత్నిస్తున్న యువత శాంతియుతంగా, అహింసా పద్ధతిలో తమ డిమాండ్ల కోసం పోరాటం చేయాలని సోనియా కోరారు. నిరసన చేపడుతున్న యువతకు మద్దుతుగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఉందని, అగ్నిపథ్‌ ‌స్కీమ్‌ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని సోనియా అన్నారు.•ంద్ర కొత్తగా ప్రవేశపెట్టిన మిలటరీ రిక్రూట్‌మెంట్‌ ‌స్కీమ్‌పై నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో పౌరులంతా శాంతియుతంగా వ్యవహరించాలంటూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు.

ఈ మేరకు శనివారంనాడు ఒక ప్రకటన విడుదల చేశారు. వాణిని పట్టించుకోకుండా ప్రభుత్వం పూర్తిగా దిశానిర్దేశర లేని కొత్త పథకాన్ని ప్రకటించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. అహింసా పద్ధతిలో అందరూ శాంతియుతంగా నిరసనలు తెలపాలని కు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇండియన్‌ ‌నేషనల్‌ ‌కాంగ్రెస్‌ ‌తోనే ఉంటుందని సోనియాగాంధీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యువతతో పాటు, పలువురు మాజీ సైనికులు, రక్షణ నిపుణులు కూడా అగ్నిపథ్‌ ‌పథకాన్ని ప్రశ్నిస్తున్నారని, యువతకు తమ పార్టీ అండగా ఉంటుందని సోనియాగాంధీ అన్నారు. ఆర్మీలో లక్షలాది ఉద్యోగాల ఖాళీలు ఉన్నప్పటికీ రిక్రూట్‌మెంట్ల విషయంలో మూడేళ్లుగా జరుగుతున్న జాప్యంపై యువత మనోవేదనను తాను అర్ధం చేసుకోగలనని అన్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశానికి టెస్ట్‌లు రాసి ఫలితాలు, నియామకాల కోసం యువత ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్‌ ‌పార్టీ పూర్తి శక్తిసామర్థ్యాలతో యువతకు అండగా నిలుస్తుందని, వారి ప్రయోజనాల కోసం, స్కీమ్‌ ఉపసంహరణ కోసం బాసటగా నిలుస్తుందని హా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *