దివ్యాంగుల ఓటింగ్‌ పెంచేలా ప్రత్యేక దృష్టి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 21 : దివ్యాంగుల ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి కేటాయించారు. ఈ మేరకు
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరి ఆదేశాల మేరకు స్వీప్ భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలో మూసాపేట ప్రాంతంలో మంగళవారం దివ్యాంగులకు ప్రత్యేక ఓటర్ అవగాహన కార్యక్రమము, బాల వికాస ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో న్యూ శక్తి దివ్యంగుల
 సంస్థ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అసిస్టెంట్ డైరెక్టర్ మేడ్చల్ జిల్లా యాదగిరి, స్వీట్ రిసోర్స్ పర్సన్స్ శ్రవణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటు యొక్క ప్రాముఖ్యత, పోలింగ్ కేంద్రం దగ్గర ప్రత్యేకంగా దివ్యాంగుల కొరకు వసతులు ఏర్పాటు చేయబడిన ర్యాంపు వీల్ చైర్, ఎస్కార్ట్ గురించి దివ్యాంగులకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మునిస్వామి, బాల వికాస్ ఫౌండర్ చైర్మన్ శ్యాంసుందర్, ఫ్యూడ్ చైర్మన్ గంగ రాము, సెక్రెటరీ నాగభూషణం, నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుగొండ వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి చిరంజీవి,  హాప్స్ ఆనంద్ నియోజకవర్గంలోని దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *