దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కొనసాగుతున్న దర్యాప్తు

అభిషేక్‌ ఇచ్చిన సమాచారంతో లోతుగా విచారణ
న్యూ దిల్లీ, అక్టోబర్‌ 12 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో సీబీఐ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. బోయినపల్లి అభిషేక్‌ ఇచ్చిన సమాచారంతో అమిత్‌ అరోరాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అమిత్‌ అరోరాకు చెందిన బడ్డీ రిటైల్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కు హవాలా రూపంలో నగదు బదిలీలు జరిగినట్లు అధికారులు గుర్తించి ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్ట్ ‌లు జరిగే అవకాశం ఉంది. లిక్కర్‌ ‌స్కాం కేసు విచారణలో సీబీఐ దూకుడు కొనసాగిస్తోంది.
ఈ కేసులో అరెస్టైన అభిషేక్‌ ‌బోయినపల్లిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించడంతో ఇవాళ రెండో రోజు విచారణ కొనసాగుతోంది. లిక్కర్‌ ‌పాలసీకి సంబంధించి హైదరాబాద్‌, ‌ఢిల్లీ వి•టింగ్‌?‌లో పాల్గొన్న వారి వివరాలను సీబీఐ సేకరిస్తోంది. స్కాంతో సంబంధమున్న పొలిటికల్‌  ‌లీడర్లు, లిక్కర్‌ ‌కంపెనీల యజమానుల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ లిక్కర్‌ ‌స్కాం కేసులో రామచంద్ర పి•-లళై, బోయినపల్లి అభిషేక్‌ ‌రావు స్టేట్‌?‌మెంట్‌ ‌కీలకంగా మరింది.
దాని ఆధారంగా సీబీఐ అధికారులు రాష్టాన్రికి చెందిన మరో నలుగురిని విచారించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో కొందరికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అభిషేక్‌ ‌వద్ద లభ్యమైన రూ.3.85కోట్లకు సంబంధించిన లెక్కలపై సీబీఐ ఆరా తీస్తోంది. అభిషేక్‌ ‌రావు, సవి•ర్‌ ‌మహేంద్రు, విజయ్‌ ‌నాయర్‌ ‌బ్యాంక్‌ ‌లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు.

m

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *