సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం..ఎంపి స్థానాలపై తుది నిర్ణయం
న్యూదిల్లీ, మార్చి 27 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వారు దిల్లీకి వెళ్లారు. రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావస్త్రశానికి హాజరుకానున్నారు. తెలంగాణలో పెండిరగ్‌లో ఉన్న లోక్‌సభ స్థానాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
ఇప్పటికే 2 దఫాల్లో 9 మందిని ఏఐసీసీ ప్రకటించిన పార్టీ మరో 8 స్థానాలు ఖమ్మం, భువనగిరి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్ అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చించి సీఈసీ తుది నిర్ణయం తీసుకోనుంది. 8 స్థానాల్లో 5 స్థానాలపై ఒక అభిప్రాయానికి వొచ్చినట్టు సమాచారం. మిగితా మూడు స్థానాలు..ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్ స్థానాలపై కాంగ్రెస్ నేతలు కసరత్త్తు చేస్తున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, తుమ్మల యుగంధర్, రాజేంద్ర ప్రసాద్‌లు టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరి నుంచి టికెట్ కోసం చామల కిరణ్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గుత్తా అమిత్, కోమటి రెడ్డి ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తుంది. నిజామబాద్ టికెట్ బరిలో జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, అనిత రెడ్డి ఉన్నారు. రాత్రికి అన్ని స్థానాలపై క్లారిటీ వొచ్చే అవకాశం ఉంది.





