దిల్లీ కాంగ్రెస్‌ ‌నూతన చీఫ్‌గా అర్వీందర్‌ ‌సింగ్‌ ‌లవ్లీ

న్యూదిల్లీ,ఆగస్ట్31 : ‌దిల్లీ కాంగ్రెస్‌ ‌నూతన చీఫ్‌గా అర్వీందర్‌ ‌సింగ్‌ ‌లవ్లీ నియమితులయ్యారు. అర్వీందర్‌ ‌నియామకంపై ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌కమిటీ జనరల్‌ ‌సెక్రటరీ కె.సి. వేణుగోపాల్‌ ‌గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ (డిపిసిసి) అధ్యక్షుడిగా తక్షణమే అర్వీందర్‌ ‌సింగ్‌ ‌బాధ్యతలు చేపట్టనున్నారని పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా అనిల్‌ ‌చౌదరి అందించిన సహకారానికి పార్టీ అభినందనలు తెలిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

గాందీనగర్‌ ‌నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యెగా ఎన్నికైన అర్వీందర్‌ .. 2003-2013 ‌మధ్య షీలాదీక్షిత్‌ ‌ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధి,విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అర్వీందర్‌ 2017‌లో కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరారు. తిరిగి 2008లో కాంగ్రెస్‌పార్టీలో చేరారు. 2013, 2015 సంవత్సరాల్లోనూ డిపిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం మరోసారి కాంగ్రెస్‌ ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *