న్యూ దిల్లీ, డిసెంబర్ 16 : దిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించడంపై సీఎం కేసీఆర్‌కు అభినందనలు వెల్లువెతుతున్నాయి. పలువురు నాయకులు, ప్రముఖులు కలసి అభినందిస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే హన్మంత్ షిండె, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు తదితరులు ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసి అభినందనలు తెలియజేసారు. అలాగే మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ కార్యదర్శి ప్రజ్ఞా తదితరులు ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుష్పగుచ్ఛ అందించి శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పుటం పురుషోత్తం ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన వారిలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావులు కూడా ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, బీఆర్‌ఎస్ నేతలు బూడిద భిక్షమయ్యగౌడ్, పల్లె రవికుమార్ తదితరులు అభినందనలు తెలిపారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసిన తెలంగాణ డియా అకాడ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే నేత ఆస్కాని మారుతీసాగర్ తదితరులు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన ఏపీకి చెందిన లాడుగు గోవిందరావు. చిత్రంలో గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు తదితరులు దిల్లీలో సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేసారు. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్,అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్,రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్,టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు కూడా ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.




