న్యూ దిల్లీ, డిసెంబర్ 19 : దిల్లీలోవాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. మోడరేట్ కేటగిరి నుంచి వెరీ పూర్ కేటగిరికి దిగజారింది. గత రెండు రోజుల నుంచి ఎయిర్ క్వాలిటీ మోడరేట్ కేటగిరిలో ఉండగా.. ఇవాళ వెరీ పూర్ కేటగిరికి చేరింది. మరో వైపు ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది.
ఒ వైపు పొల్యూషన్ మరోవైపు చలితో దిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొల్యూషన్‌తో పాటు, చలి కారణంగా సీజనల్ వ్యాధుల బారీన పడుతున్నట్లు దిల్లీ ప్రజలు చెబుతున్నారు. ఎయిర్ పొల్యూషన్ తో శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలుపుతున్నారు. పిల్లల్ని బయటకు పంపించాలంటేనే భయమేస్తుందని.. పిల్లలు, వృద్ధులు ఊపిరితిత్లు సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



