పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 24: దసరా పండుగను పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని మైత్రి స్టేడియంలో నిర్వహించిన దసరా సంబరాల్లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద నిర్వహించిన ద్వజారోహన కార్యక్రమంలో పాల్గొని, జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన శమీ పూజలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, పురప్రముఖులతో కలిసి మైత్రి స్టేడియంలో నిర్వహించిన రావణాసుర దహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించి దసరా పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, నందీశ్వర్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, సపానదేవ్, పట్టణ పుర ప్రముఖులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.అమీన్ పూర్ లో..అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో దసరా సందర్భంగా మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట పైన ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా నిర్వహించే విజయదశమి వేడుకలను మున్సిపల్ పరిధిలో ప్రజలందరి సమక్షంలో నిర్వహించడం అభినందనీయం అన్నారు.




