శ్రవణ నక్షత్రంతో కూడి

అశ్వయుజదశమికి

విజయ అను సంకేతంతో

వచ్చిందే విజయదశమి.

 

ఏ ముహూర్తం చూడక

ఈనాడు ఏ పని తలపెట్టిన

కలుగును విజయం అనేది

ఈపండగ విశేషం-ప్రాధాన్యం

 

దుర్గా దేవుని భక్తితో

తొమ్మిది రోజులు శ్రద్ధగ

నవరాత్రులపేరిట వేడుకగ

చేయురు అంతా పూజలు.

 

పాలపిట్ట దర్శనం

జమ్మిచెట్టు ప్రదక్షిణం

అలాయ్‌ ‌బలాయ్‌ ‌లతో

స్నేహం బంధాలను

కలుపుకపోతారు

 

దుర్గ భవానికి ప్రణామం

పెద్దల దీవెన ఆశీర్వాదం

దశమి నాటి సంబరం

అందరికికలగాలి ఆనందం.

 

– ఎన్‌.‌రాజేష్‌

(‌కవి,జర్నలిస్ట్)

‌హైదరాబాద్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *