ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 7 : అమనగల్లు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ 11వ వార్డు ఆదర్శనగర్ కాలనీలో సిసి రోడ్ పనులను కౌన్సిలర్ బైకాని యాదమ్మ శ్రీశైలం యాదవ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.10 లక్షలతో సిసి రోడ్ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. దశల వారీగా సమస్యలు తీరుస్తాము అని కాలనీలో ఏమైనా సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమములో వైస్ ఛైర్మెన్ దుర్గయ్య, మాజీ జెడ్పిటిసి కండేహరిప్రసాద్, కౌన్సిలర్లు, చెన్నకేశవులు, దివ్య శ్రీకాంత్ సింగ్, కృష్ణ యాదవ్, విక్రం రెడ్డి, చెక్కల లక్ష్మణ్, మేడిశెట్టి శ్రీధర్, నాయకులూ గిరి యాదవ్, వెంకటేష్, నందు, శ్రీను, అశోక్, పెద్దయ్య, పర్వతాలు, నరసింహ, భరత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



