- మూడెకరాల హావి గుప్పించిందెవరు
- బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న
కరీంనగర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : తాము ఫాల్స్ హావి•లు ఇవ్వడం కాదు..వి•రే దళిత ముఖ్యమంత్రి అని ఇచ్చిన హావి•ని నిలబెట్టుకోలేదని బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం జీవన్‌రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ…ఫాల్స్ హావి•లు తమవి కాదని, దళిత ముఖ్యమంత్రి హావి• ఇచ్చింది బిఆర్‌ఎసేనని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరులో తాము వోట్లు అడగమని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేని ఊర్లో వి•రు వోట్లు అడగొద్దని ఆయన కవితకు సవాల్ విసిరారు. బిఆర్‌ఎస్ కేబినెట్‌లో కూర్పు ఎలా ఉంది కవిత అంటూ ప్రశ్నించారు. ‘దళితులకు వి•రు ఒక్క ఇల్లు అయినా కట్టించారా?, వాస్తవాలు చెబితే వినే ఓపిక లేదా?, వి• వైఫల్యాలను ఎత్తిచూపుతే ఎందుకు భయం.
బీఆర్‌ఎస్, కేసీఆరే అసలైన దళిత ద్రోహి. ఎన్నికల ముందు నీకు బీసీలు గుర్తొచ్చారా’ అంటూ జీవన్‌రెడ్డి నిలదీశారు. దళిత సిఎంను చేస్తామని, 3 ఎకరాలు ఇస్తామని ఇచ్చిన హావి•లు నిజం కాదా అని అన్నారు. కాంగ్రెస్‌కు ఎస్సీ, ఎస్టీలు అండగా నిలబడాలని, వారికి ఇందిరా గాంధి నుంచి కాంగ్రెస్ అండగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. దళితులకు ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా వారి సంక్షేమం కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం హర్షనీయమన్నారు. అంబేడ్కర్ అభయహస్తం పేరిట రూ. 12 లక్షల ఆర్థిక సాయం, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 18 శాతం, 12 శాతం చేస్తామని ప్రకటించడం, వర్గీకరణకు సానుకూలత వ్యక్తం వంటి విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులపై చూయిస్తున్న వివక్షను దళిత వర్గాలకు వివరించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను నిలదీయాలన్నారు.




