సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 27: బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ మాట్లాడుతూ సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో కేవలం 20 దళిత బంధు స్కీములు ప్రకటించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, పుల్లూరు గ్రామంలో దాదాపు 200 ఎస్సీ ఇండ్లు ఉన్నటువంటి మేజర్ గ్రామపంచాయతీ ఇప్పటివరకు 2014 నుండి ఒక డబల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వకుండా దళిత బంధిస్తున్నామని చెప్పి కులాల మధ్య చిచ్చు పెడుతూ కేవలం 20 దళిత బంధు స్కీములు ఇవ్వడం దేనికి నిదర్శనం. వెంటనే మంత్రి హరీష్ రావు గారు స్పందించి పుల్లూరు గ్రామం మొత్తం దళిత బంధు అమలయ్యేలా చూడాలి. లేదంటే సిద్దిపేటలో బీఎస్పీ ఆధ్వర్యంలో మంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పుల్లూరు ఉమేశ్ హెచ్చరించారు.




