దళిత జర్నలిస్టులకు దళిత బంధు వర్తింప చేయాలి

జగదేవ్ పూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: దేవుడు కరుణించిన వరుణుడు వరమామిస్తాడు అన్న నినాదం లాగా ఉన్నదని గజ్వేల్ నియోజకవర్గం లో అమలవుతుందని దళిత్ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు  అన్నారు. సిద్దిపేట జిల్లా మంత్రి తన్నీరు హరీష్ రావు దళిత జర్నలిస్టులకి దళిత బంధు మంజూరు చేయాలని సూచించినప్పటికీ గజ్వేల్ నియోజకవర్గం లో మాత్రం అమలు చేయడం లేదన్నారు. ముగ్గురు జర్నలిస్టులకు మాత్రమే దళిత బంధు అమలుచేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.సిద్దిపేట జిల్లాలోని సిద్ధిపేట  హుస్నాబాద్ దుబ్బాక నియోజకవర్గం అమలు చేసిన పథకం గజ్వేల్ నియోజకవర్గం లో అమలు చేయకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో పార్టీలు మారి పదవులు చేపట్టొచ్చు కానీ నిజాయితీగా నియోజకవర్గంలోని మండలాలలో వార్తలు రాస్తున్న విలేకరులకు మాత్రం ఆంక్షలు విధిస్తారు ఇదేంటని ప్రశ్నిస్తే దళిత జర్నలిస్టులను చిన్న చూసి మాట్లాడుతున్నారని చెప్పారు.గజ్వేల్ నియోజకవర్గం లోని దళిత జర్నలిస్టులకు దళిత బందు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం లోనే దళిత జర్నలిస్టులకు న్యాయం జరగకపోవడం అత్యంత దుర్మార్గమని వాపోయారు. జిల్లా ఇన్చార్జి మంత్రి స్పందించి గజ్వేల్ నియోజకవర్గం లోని దళిత జర్నలిస్టులు అందరికీ దళిత బంధు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం గజ్వేల్ పట్టణంలో బి డబ్ల్యు జే ఎస్ ఆధ్వర్యంలో దళిత జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూజేఎస్ గజ్వేల్ డివిజన్  ప్రధాన కార్యదర్శి శివ దాస్, ప్రచార కార్యదర్శి రామ స్వామి, దోమ నర్సింలు చింతకింది స్వామి శ్రీనివాస్ ప్రభాకర్ గిరి కరుణాకర్ కనకయ్య మల్లేశం కరుణాకర్ ప్రవీణ్ ఎల్లం రాజు మహేష్ దుర్గయ్య దయాకర్ తదితరు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *