దళితులను వంచించిన చరిత్ర కాంగ్రెస్‌దే

  • కొత్తగా డిక్లరేషన్‌ అం‌టూ మభ్య పెట్టే యత్నం
  • దళితులను మోసం చేయడం తప్ప మరోటి కాదు
  • కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌పై మండిపడ్డ కవిత

కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ దళితుల వి•ద ఎక్కడా లేని ప్రేమ ఒలుకబోస్తుందని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. దశాబ్దాలుగా వారిని అణిచివేతకు గురిచేసిన విషయం మరచిపోయినట్లుగా ఉందని అన్నారు. కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంప్‌ ‌కార్యాలయంలో గంపగోవర్ధన్‌తో కలసి ఆమె విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ‌పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఎస్సీ డిక్లరేషన్‌ ‌పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్య్రం తప్ప మరొకటి కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ చేస్తున్న పనులని కాంగ్రెస్‌ ‌పార్టీ కాపీ కొడుతుందని, కాంగ్రెస్‌ ‌పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఆమె ఆరోపించారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే వచ్చి ఎస్సీ డిక్లరేషన్‌ ‌చేయడం అర్రాస్‌ ‌పాట పాడినట్టు ఉందని, రాజకీయం కోసం తప్ప దళితుల కోసం చేసేదేవి• లేదని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులు పాలించిన కాంగ్రెస్‌ ‌పార్టీ దళితులకు ఏమి చేసిందని ప్రశ్నించారు. రైతుల కోసం బీజేపీ వి•టింగ్‌ ‌పెట్టడం ఆ సభకు, అమిత్‌ ‌షా రావడం చూస్తుంటే హంతకుడే రైతులకు సంతాపం తెలిపినట్టుందని ఎమ్మెల్సీ కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దళితుల కోసం పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, కర్ణాటకలో ఆర్థిక పరిస్థితిని కుంటి సాకుగా చెప్తూ ఉచిత పథకాలను ఎత్తి వేసిందని అన్నారు. తెలంగాణలో ప్రారంభించిన రైతు బంధును కాపీ కొట్టిన మోడీ ప్రభుత్వం తొలుత 13 కోట్ల మందికి రైతు బంధు ప్రారంభించి ఇప్పుడే 2.5 కోట్ల మందికే ఇస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అందరికీ ఇస్తున్నామన్నారు. బీజేపీ మోటర్లకి వి•టర్లని పెట్టాలని చూస్తుందని, బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు లేరని కవిత అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్‌ ‌పునరుద్ఘాటించారు. షబ్బీర్‌ అలీని గంప గోవర్దన్‌ ‌నాలుగు సార్లు ఒడించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కామారెడ్డిలో కేసిఆర్‌ ‌పోటీ చేస్తారని అన్నారు. ఎస్సీలను ఎన్నో ఏండ్లు పేదరికంలో ఉంచిన చరిత్ర కాంగ్రెస్‌ది అని మండిపడ్డారు. ఆ పార్టీ రాజకీయ లబ్దికోసం చేసే ఎత్తుగడలు తప్ప దళితుల కోసం చేసేదేవి• లేదన్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ పార్టీలకు అభ్యుర్థులే లేరన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *