దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో సర్వం సుభిక్షంగా ఉండాలి

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో సర్వం సుభిక్షంగా ఉండాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్  అన్నారు. మంగళవారం శ్రీదత్త జయంతి సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తా త్రేయ స్వామిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం విట్టల్నాయక్ ను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఆలయ ప్రాంగణంలో  భక్తులకు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ దత్తజయంతి పురష్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పదన్నారు.ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకో వడం జరుగుతుందని వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రిటైర్డ్ డిఎస్పి అనంతయ్య, కౌన్సిలర్స్ సాహూ శ్రీలత లక్ష్మీకాంత్, పూజారులు భక్తులు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *