సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: కమిషనర్ సంపత్ కుమార్,మాజీ చైర్మెన్ కడవెర్గు రాజనర్సు కరీంనగర్ రోడ్డు వైపున వైశ్య సదన భవనం నిర్మాణం పనులను పరిశీలించారు. వైశ్య సధన భవనం ఎదురుగా గల వైశ్య ఫంక్షన్ హాల్ కి ప్లాస్టరింగ్ చేపించి రంగులు వేపించాలని మహేష్ ఈ ని ఆదేశించారు. వైశ్య సధన భవనం చుట్టు పచ్చదనం ఉండేలా మొక్కలు నాటలన్నారు. సెంట్రల్ ఏసీ పనులు పరిశీలించి,ఎంట్రెన్స్ వైపున సి సి రోడ్డు వేయాలని,చుట్టు కాంపౌండ్ వాల్ నిర్మించాలని,సౌండ్ సిస్టం ఏర్పాటుచేయాలని పనులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.


