త్రిమూర్తుల అవతారం దత్త ప్రభువు

పటాన్ చెరు, ప్రజాతంత్ర,డిసెంబర్ 26: దత్తాత్రేయ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంగళవారం దత్తాత్రేయ స్వామి జయంతి ని పురస్కరించుకుని నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలం మధుర లోని శ్రీ దత్తచల క్షేత్రం లో నిర్వహించిన  దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరై సహస్ర ఘటజలాభిషేకం, పంచవత చండీ సహిత దత్తాత్రేయయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.త్రిమూర్తుల అవతారమైన దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎన్ఎం అర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.అనంతరం నీలం మధు మాట్లాడుతూ… బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశాలతో జన్మించిన అవతార మూర్తి దత్తాత్రేయ స్వామి ఉపదేశించిన ఉపదేశాలు ప్రతి ఒక్కరికి ఆచారణీయమన్నారు. ఆ భగవానుడు చెప్పిన బాటలో పయనిస్తే అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని ప్రసరింప చేసి లోక శాంతి జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో పయనించి ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉత్సవ నిర్వాహకులు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *