త్యాగానికి ప్రతీక బక్రీద్

  • ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్ 

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ )  పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు సోమవారం ఈ పండుగ జరుపుకుంటున్నారని గుర్తు చేశారు.

ప్రవక్తల అచంచలమైన దైవ భక్తి, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవుని పై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పర్వదినం

 మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని చాటిచెపుతోందని సీఎం అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *