ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : ఆమనగల్లు పట్టణానికి చెందిన తోకల నారాయణ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి నారాయణ భార్య పద్మమ్మ, కుమారులు శ్రీనివాస్, అశోక్, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, మేదరి సంఘం జిల్లా కోశాధికారి ఎనమల యాదగిరి, ఆమనగల్లు, యాచారం, కందుకూరు మేదరి సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, నరసింహ, రామస్వామి, నాయకులు తోకల యాదయ్య, శ్రీను, యాదయ్య, పవన్, శ్రీనివాస్ లక్ష్మణ్ జంగయ్య సత్యనారాయణ మంజుల, కలమ్మ తదితరులు పాల్గొన్నారు.


