తొలి హ్యాండ్ బ్లెండ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన బాస్ అప్ల‌యెన్సెస్‌

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబ‌ర్ 11 : ఇన్నోవేషన్, ఎక్సలెన్స్ కు మారుపేరుగా ఉన్న బాస్ అప్లయెన్సెస్, పరిశ్రమలో ముందెన్న‌డూ లేన‌ట్లుగా 5 సంవత్సరాల వారంటీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి హ్యాండ్ బ్లెండర్‌ను ప్రవేశ పెట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇది వంట పద్ధతులను పునర్నిర్వచించడమే కాకుండా భారతీయ కుటుంబాలు పనిచేసే విధానాన్ని కూడా మారుస్తోందన్నారు. మిక్సర్ గ్రైండర్లు, జ్యూస్ ఎక్స్ ట్రాక్టర్లు, ఫుడ్ ప్రాసెసర్లు, ఓవెన్ టోస్టర్ గ్రిల్లర్లు, మరెన్నో సహా వైవిధ్యమైన ఉత్పత్తుల శ్రేణికి విస్తరించిందని తెలిపారు. బాస్ అప్లయెన్సెస్ యొక్క ఆఫర్లు భారతీయ కుటుంబాల హృదయాలను, నమ్మకాన్ని, ప్రాధాన్యతను ఆకర్షించాయన్నారు. ఇంకా మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా, అమెరికాతో సహా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా తమదైన ముద్ర వేశాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *