తొలగించిన 26 బిసి కులాలను తిరిగి చేర్చాలని సిఎంకు వినతి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 :  తొలగించిన 26 బిసి కులాలను తిరిగి బీసీ జాబితాలో చేరుస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని త్వరలో నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని తెలంగాణ రాష్ట్ర తొలగించిన 26 బిసి కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వివక్షతో తొలగించిన 26 బిసి కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చే ఫక్రియ ప్రారంభించడానికి వెంటనే చెర్యలు తీసుకోవాలని కోరుతూ తొలగించిన 26 బిసి కులాల ప్రతినిధులు ఆళ్ల రామకృష్ణ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలసి వినతి పత్రం అందజేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1952 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు నుండే తొలగించిన 26 బిసి కులాల ప్రజలు తెలంగాణ లోని అన్ని జిల్లాలలో నివసిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 లో బలహీనవర్గాలైన 26 బిసి కులాలను బిఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్ర బీసీ జాబితా నుండి తొలగించిందని ఆళ్ల రామకృష్ణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కు వివరించామన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వికృత చర్యల వల్ల నేడు తొలగించిన 26 బిసి కులాల తల్లితండ్రులు బిసిలుగా ఉన్నారని, వారి పిల్లలు ఓసీలుగా మారి బీసీ రిజర్వేషన్లు దక్కక విద్య, ఉద్యోగ వకాశాలలో తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు పరశురామ్, చతుర్ భుజ్, అప్పు వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *