తొమ్మిదో వార్డులో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం 

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 27 : ఆమనగల్లు మున్సిపాలిటీ 9వ వార్డులో పోస్ట్ ఆఫీస్ కాలనీ విద్యానగర్ కాలనీ లో కల్వకుర్తి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమనగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, ఆమనగల్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ సోనా జయరాం నాయక్, ఆమనగల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుత్తి బాలస్వామిల ఆధ్వర్యంలో వో టర్లను కలుస్తూ కారు గుర్తుపై ఓటు వేసి మరోసారి జైపాల్ యాదవ్ ను గెలిపించి వార్డులను అభివృద్ధి పరచుకోవాలన్నారు. మున్సిపాలిటీ బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు సయ్యద్ ఖలీల్, జహంగీర్, యనమల రమేష్, చక్రి నాయక్, గుత్తి శేఖర్, బి. బాలస్వామి, గోపాల్, జయన్న రావు, గౌసియా, పార్వతమ్మ, పద్మ, అంజలి, సబియా, అనిత, బక్కమ్మ, ఇందిరమ్మ, బాబా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *