తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపైన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, భవిష్యత్తు తరాలకు మహనీయుల చరిత్రను తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.అతి త్వరలో సాకి చెరువు కట్టపై చాకలి ఐలమ్మ విగ్రహాన్నిఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్,  బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, రజక సంఘం ప్రతినిధులు, సీనియర్ నాయకులు, పట్టణ పుర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *