
రాష్ట్రం లో శుక్రవారం మూడో రోజు భారత్ జోడో పాదయాత్ర యాత్ర ఉదయం ఎలిగండ్ల నుంచి గోప్లపూర్ కలాన్ వరకు .. రాత్రి 7 గంటల వరకు మాన్యంకొండ వరకు కొనసాగనున్నది. యాత్రికులు ధర్మపూర్ లో రాత్రి బస చేయనున్నారు. పాదయాత్రలో లో రాహుల్ గాంధీ తో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి,కేసీ వేణుగోపాల్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, టీపీసీసీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కన్వీనర్ బలరాం నాయక్, మధు యాష్కీ, తదితరులు ఉన్నారు.. పాదయాత్ర లో రోడ్ పక్కన ఆయన కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు పాఠశాల విద్యార్థులను పిలిచి వారితో కలిసి రాహుల్ గాంధీ నడిచారు.



