షాద్ నగర్ ప్రజాతంత్ర అక్టోబర్ 26 :గంట్లవెళ్లి, శేరిగూడ గ్రామాల్లో భారీగా ఎన్నికల ప్రచారం షాద్ నగర్ నియోజక వర్గ ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలని స్థానిక ఎమ్మెల్యే టిఆర్ఎస్ అభ్యర్థి వై అంజయ్య యాదవ్ ప్రజలను ఎన్నికల ప్రచారంలో కోరారు. ఫరూక్ నగర్ మండలం గంట్లవెళ్లి, శేరిగూడ గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ తొమ్మిది యేండ్లలో ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ గెలుపొందిన నాటి నుండి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. శేరిగూడ నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు. 34 లక్షలతో గంట్లవెళ్ళి, 19 లక్షలతో శేరిగూడ గ్రామాల్లో సిసి రోడ్లు, అంతర్గత మురుగుకాలువల నిర్మాణం పనులు. 42 మంది లబ్ది దారులకు కేసీఆర్ కిట్ల పంపిణీ. ఆసరా పింఛన్ ధ్వారా గంటలవెళ్ళిలో 103 మందికి ప్రతి నెల 2.17 లక్షలు, శేరిగూడలో 39 మందికి ప్రతి నెల 88.60 లక్షలు అందిస్తున్నాం. కమ్మదనం నుండి పాపిరెడ్డిగూడ వయా గంటలవెళ్ళి, శేరిగూడ డబల్ రోడ్డు కోసం 8 కోట్లు, బి.టి మరమ్మత్తుల కోసం 56.30 లక్షలు మంజూరు. 46.40 లక్షల వ్యయంతో మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మాణం ద్వారా గంట్లవెళ్ళిలో 281 నల్లా కనెక్షన్లు, 35 లక్షలతో శేరిగూడలో ట్యాంకు నిర్మాణం ద్వారా 231 నల్లా కనెక్షన్లతో త్రాగునీటి సరఫరా. మిషన్ కాకతీయ ద్వారా గంట్లవెళ్ళిలో రూ. 34.40 లక్షలతో 2 చెరువులు, శేరిగూడలో 46 లక్షలతో 2 చెరువుల పూడికతీత. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు గంట్లవెళ్ళి – 47 మంది, 47.02 లక్షలు, శేరిగూడ 17 మంది 17.01 లక్షలు. రైతు బంధు లబ్ధిదారులు గంట్లవెళ్ళి 448 మంది, 43.8 లక్షలు. శేరిగూడ 393 మంది, 34.6 లక్షలు. రైతు రుణమాఫీ లబ్ధిదారులు గంట్లవెళ్ళి- 377 మంది, 1.86 కోట్లు, శేరిగూడ- 67 మంది 50 లక్షలు. రైతు భీమా లబ్ధిదారులు గంట్లవెళ్ళి – 6 మంది, 30 లక్షలు, 4 మంది 20 లక్షలు. గ్రామంలో క్రీడా ప్రాంగణం, వైకుంఠధామం ఏర్పాటు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారుగుర్తు పార్టీకి అండగా ఉంటూ కారుగుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ తెలియ చేశారు..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే సాధ్యం




