ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 : తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియామ్మకు అండగా ప్రతి ఒక్కరూ నిలబడాలనీ టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆమనగల్లులో కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూమొదటి విజయభేరీ సభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తుక్కుగూడలో విజయభేరిని విజయవంతం చేయాలన్నారు. ఆదరించి ఆశీర్వదించిన ఆడబిడ్డలకు తోడుగా నమ్మించి గొంతు కోసిన నయవంచకుని గుండెల్లో నిద్రపోయి కెసిఆర్ కు గుణపాఠం చెప్పాలని అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త విజయభేరి మహా సభలో భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలనీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నికార్సైన తెలంగాణోడా.. మోగిద్దాం రా విజయబేరి అంటూ ప్రతి ఒక్కరూ తరలిరావాలన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మకు అండగా నీలుద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, మండల అధ్యక్షుడు తెల్గమల్ల జగన్, మానయ్య, జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్, జిల్లా నాయకులు వెంకటయ్య, వస్పుల శ్రీశైలం, పర్వతాలు, ఖాదర్, బాబా, సురేష్ నాయక్, అలిమ్, శ్రీను, సురేష్, శేఖర్, సుదర్శన్, కరీం, మహేశ్, జంగయ్య, మహేష్, విజేందర్, ప్రసాద్ పాల్గొన్నారు..


