తెలంగాణ రాష్ట్రంలో వంద 80 కోట్ల విలువైన మెడికల్ కళాశాలలకు శంకుస్థాపనలు చేసుకున్నాం

● కందుకూరులో మెడికల్ కళాశాల నిర్మించుకోవడం ఇక్కడున్న ప్రజలు చేసుకున్న పుణ్యమే
● కేసిఆర్ కందుకూరుకు ఇచ్చిన వరం
● మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

కందుకూరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : తెలంగాణ రాష్ట్రంలో వంద 80 కోట్ల విలువైన మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.ఆదివారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు మండలంలో మిర్ఖాన్పేట్ వద్ద మెడికల్ కళాశాలకు,ఆసుపత్రి భవనానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి,ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్,గిడ్డంగుల శాఖ చైర్పర్సన్ రజిని సాయిచంద్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లాకు కెసిఆర్ ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజ్ ను మంజూరు చేశారని,ఆ మెడికల్ కళాశాలను కందుకూరులో నిర్మించుకోవడం ఇక్కడున్న ప్రజలు చేసుకున్న పుణ్యమని ఆయన పేర్కొన్నారు.నగరంలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి లాంటిది ఇక్కడ ఈప్రాంతంలో ఉండాలనే సదుద్దేశంతో కేసిఆర్ కందుకూరుకు ఇచ్చిన వరం మెడికల్ కళాశాల అని అన్నారు. మెడికల్ కళాశాలతో పాటు నాలుగు వందల యాభై పడకల ఆసుపత్రి ఇక్కడ సంవత్సరంలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రభుత్వ దవాఖానాల్లో సరైన వైద్యులు అందుబాటులో లేక రోగులు నానా అవస్థలు పడేవారని నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కెసిఆర్ తొమ్మిదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ దావఖానాల పరిస్థితి మెరుగుపడిందని ఆయన తెలిపారు.రంగారెడ్డి జిల్లాతో పాటు నల్లగొండ,మహబూబ్నగర్,నాగర్ కర్నూల్, వికారాబాద్ తడితర ప్రాంతాల ప్రజలకు 450 పడకల ఆసుపత్రి త్వరలోనే అందుబాటులోకి రానుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.ఇక్కడ ప్రాంత ప్రజలకు మంచి వైద్యం అందించేందుకు వీలు పడుతుందనే ఈప్రాంత ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి వైద్య ఆరోగ్యశాఖటీఎస్ఐఐసి వారిని పట్టుబట్టి ఒప్పించి ఈ ప్రాంతంలో వైద్య కళాశాలతో పాటు ఆసుపత్రి నిర్మించాలని కోరడంతో కెసిఆర్ ఆస్పత్రి నిర్మాణానికి కళాశాల నిర్మాణానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.దేశంలో 170 మెడికల్ కాలేజీలు ఉంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఒక్కటి కూడా రాలేదని మంత్రి తెలిపారు.కేసీఆర్ పాలనలో 35 మెడికల్ కాలేజీలు నిర్మాణాల కోసం అనుమతులు ఇచ్చారని హరీష్ రావు పేర్కొన్నారు.వైద్య సీట్ల కోసం తెలంగాణ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులు విదేశాలకు వెళ్లి మెడికల్స్ సీట్లు సంపాదించుకొని వైద్యులు కావడానికి నానా ఇబ్బందులు పడేవారని ఆవేదన వ్యక్తం చేశారు.60 సంవత్సరాల్లో కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో రెండు కాలేజీలు మాత్రమే ఉన్నాయని కేసిఆర్ పాలనలో 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చారని అన్నారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కనీసం డిగ్రీ కాలేజ్ కూడా లేదని,కేసీఆర్ ముందస్తు ఆలోచనతో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తేవడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.వైద్యులుగా రాణించాలనే దృక్పథం ఉన్న విద్యార్థులకు తెలంగాణలో అతి తక్కువ ఫీజుతో డాక్టర్లుగా తయారు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి కందుకూరు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో అనుబంధం ఉందని అన్నారు.దీనిని దృష్టిలో ఉంచుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ముచ్చర్ల ప్రాంతం వరకు మెట్రో రైలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని హరీష్ రావు పేర్కొన్నారు.కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వైట్ కలర్ నేరగాళ్ళని ప్రోత్సహించారని కెసిఆర్ తెలంగాణలో వైట్ కోర్ట్ ను ప్రోత్సహించారని ఆయన అన్నారు. నల్లధనం తెచ్చి పేదలకు 15 లక్షల చొప్పున అకౌంట్లో వేయడం ఏమో కానీ నల్లధనం నేరగాలని దేశం దాటించెందుకు ప్రయత్నించిందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో నల్లాలేని ఇల్లు లేదని పునరుద్ధరణ లేని చెరువులు లేవని ఆసరా, కల్యాణ లక్ష్మి,దళిత బంధు,బీసీ బందు, మైనార్టీ బందు ఇతర అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చిందని మంత్రి అన్నారు. గతంలో నేను రాను బిడ్డో ఈ ప్రభుత్వ దావఖానకు అనేవారని నేడు ప్రజలు పోదాం పధు సర్కారు దావఖానకు అన్నచందంగా కేసీఆర్ మార్చిండని తెలిపారు.పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారయిందని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు వస్తుందని మూడు గంటల కరెంటు కావాలా మూడు పంటల బిఆర్ఎస్ కావాలా ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కందుకూరు,మహేశ్వరం, ఇబ్రహీంపట్నంకి కృష్ణాజలాలను తెచ్చుకుని రెండు పంటలు పండించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.కాంగ్రెస్కు ఓటు వేస్తే తిరిగి తెలంగాణలో చీకటి మాయమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు.వచ్చే ఎన్నికల్లో మంత్రి సబితారెడ్డికి లక్ష కోట్ల మెజార్టీ ఇచ్చి ఆశ్రమం నుండి తిరిగి ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువనేత పి.కార్తీక్ రెడ్డి,కందుకూరు జెడ్పిటిసి బొక్క జంగారెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్,వైస్ చైర్మన్ గొపిరెడ్డి విజయేందర్ రెడ్డి,జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి,మిర్ఖాన్పేట్,బేగరి కంచ,అన్నోజిగూడ గ్రామాల సర్పంచులు జ్యోతి చంద్రశేఖర్,సరళ,కాకి ఇందిరా దశరథ,బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన్నే జయేందర్,కృష్ణ రాంభూపాల్ రెడ్డి,అనెగౌని అంజయ్య గౌడ్,సిద్దాల లావణ్య,మద్ది కరుణాకర్ రెడ్డి,టిఆర్ఎస్ నాయకులు సామ ప్రకాష్ రెడ్డి,సామ మహేందర్ రెడ్డి,రాయి చెట్టు యాదయ్య, ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, కార్పొరేటర్లు,కౌన్సిలర్లు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *