ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 23 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ, మెరుగైన సూచనలు చేస్తూ గ్రామపంచాయతీలను దేశంలోని మిగతా గ్రామపంచాయతీలకు ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నాయని, ప్రభుత్వ ప్రణాళికలను సర్పంచులు, పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రజల మరియు ప్రజాప్రతి నిధుల సహాయ సహకారాలతో గ్రామాలను అభివృద్ధి చేయడంలో కీలకంగా పనిచేస్తూ అహర్నిశలు కష్టపడుతున్నారని గుర్తు చేశారు. కడ్తాల్ గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని గ్రామపంచాయతీ నిధులు రూ. 10,00,000/- లక్షల ద్వారా గాజుల యాదయ్య ఇంటి నుండి లక్ష్మణ్ జీ ఇంటివరకు చేపట్టిన సిసి రోడ్డు పనులను బుధవారం స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహా రెడ్డి, ఇతర నేతలతో కలిసి ప్రారంభించారు. గ్రామంలో పలు మరిన్ని అభివృద్ధి పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ రామకృష్ణ, మార్కెట్ డైరెక్టర్ లాయక్ అలీ, రైతు సమన్వయ సమితి సభ్యులు మంగళపల్లి నరసింహ, వార్డు సభ్యులు నరేందర్ రెడ్డి, మల్లయ్య, బిక్షపతి, మహేష్, గణేష్, క్యామ ఎట్టమ్మ, నాయకులు యాదగిరి రెడ్డి, అశోక్, రామచంద్రయ్య, రామచంద్రనాయక్,మంకి శ్రీను, కో ఆప్షన్ సభ్యులు వెంకటయ్య గౌడ్, రేపని శీను తదితరులు పాల్గొన్నారు.



