తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల బతుకులు దయనీయంగా మారుతుంది
బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వని హామీలను సైతం నెరవేర్చింది
ప్రతి గ్రామ గ్రామాన అభివృద్ధి జరిగింది బిఆర్ఎస్ తోనే
ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి
కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 24 :తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదల బతుకులు దయనీయంగా మారుతాయి అని బిఆర్ఎస్ మహేశ్వరం అభ్యర్థి మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం కందుకూరుమండలపరిధిలోనిమాన్యగూడ,నేదునూరు ,దాసర్లపల్లి తండా, దాసర్లపల్లి,సాయి రెడ్డి గూడ,ముచ్చర్ల,సార్లరావులపల్లి తండా, దెబ్బడగూడ,కందుకూరు చౌరస్తాలో మంత్రి సబితా రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.తెలంగాణ ఏర్పాటు కోసం కెసిఆర్ ప్రాణ త్యాగాలకు తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలుగా పూర్తి అభివృద్ధి జరిగిందని గత పాలకుల విషయంలో రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉందని ఆమె తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిందని ఆమె గుర్తు చేశారు.ప్రతి గ్రామ గ్రామాన పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగిందని ఆమె తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి వస్తున్న సందర్భంలో ఆ పథకాలు పూర్తిస్థాయిలో నెరవేరని దిశగా వారి మేనిఫెస్టో ఉందని ఆమె ప్రజలకు వివరించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రజలు హరిగోశపడ్డారని,ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని ఆమె తెలియజేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి ప్రజలు మరువ వద్దని ఆమె తెలిపారు.ప్రతి గ్రామ గ్రామ రోడ్లు,పాఠశాలల అభివృద్ధి,వైకుంఠ దామాలు,రైతు వేదికలు పలు రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.రాష్ట్రంలో రైతులకు,వృద్ధులకు,దివ్యాంగులకు




