తెలంగాణ పీపుల్స్ ‌జాయంట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ ఆవిర్భావం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన సామాజిక, ప్రజా సంఘాల కార్యకర్తలు, మేధావులు, విద్యా వంతులు  హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంకుశ పాలనపై ప్రజలను చైతన్య పరిచి, ప్రశ్నించే గొంతును  బలోపేతం చేసేందుకు ‘‘తెలంగాణ పీపుల్స్ ‌జాయంట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ(టిపిజెఏసి)’’గా ఏర్పడ్డారు. ఈ కమిటీ ఆవిర్భావాన్ని శుక్రవారం  హైదరాబాద్‌ ‌సోమాజి గూడ ప్రెస్‌ ‌క్లబ్‌లో ప్రకటించారు.

వేదిక కమిటీ కన్వీనర్‌ ‌ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌, ‌కో కన్వినర్‌లుగా  తెలింగాణ స్లో మీడియ్య ఫోరమ్‌  అధ్యక్షులు  కరుణాకర్‌ ‌దేశాయి, తెలంగాణ విద్యా వింతుల వేదిక అధ్యక్షుడు అంబటి నాగయ్య, రైతు ఉద్యమ నాయకులు కన్నెగంటి రవి, సామాజిక కార్యకర్త సజయ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ‌సమ్మునత, ముస్లిం సంఘాల జాయింట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ నాయకులు సలీం పాషా, వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు పోగ్రెసివ్‌ ‌డెమోక్రాటిక్‌ ‌ఫోరమ్‌ ‌నాయకులు గురువా రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ  ప్రొఫెసర్‌ ‌కొండా నాగేశ్వర్‌ ‌రావు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు కొండల్‌ ‌రెడ్డి, ఆర్టీసీ నాయకులు ప్రభాకర్‌, ‌రైల్వె జాక్‌ ‌నాయకులు ముత్తయ్య, పర్యావరణ వేత్త డాక్టర్‌ ‌బాబు రావు, టిజెఎసి నాయకులు రామగిరి ప్రకాష్‌, ‌బిఎస్‌ఎన్‌ఎల్‌ ‌కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *