తెలంగాణ పట్టణాలు, నగరాల మౌళిక వసతుల అభివృద్ధ్ది లో గుణాత్మక మార్పు..

సమగ్రాభివృద్ధికి అధికారులు, పాలకమండళ్లకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌

‌రాష్ట్ర జి.డి.పి.లో మూడింట రెండువంతుల వాటాను పట్టణప్రాంతాలు కలిగి ఉన్నాయి. బెస్ట్ ‌కమర్షియల్‌ ‌మరియు రెసిడెన్సీయల్‌ ‌డెస్టినేషన్‌గా హైదరాబాద్‌ ‌మారింది.10 శివారు మున్సిపాలిటీలను జీహెచఎంసీ తో అనుసంధానం చేయుటకు 104 కారిడార్లలో రోడ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టనున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాయుతంగా అమలు చేస్తున్న మౌళిక వసతుల అభివృద్ధి, విస్తరణ పనులతో నేడు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు ప్రగతిశీల కేంద్రాలుగా మారాయి.ప్రజల భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను చేపట్టుటకు యు ఎల్‌ ‌బీ ల సంఖ్యను 69 నుండి నేడు 142 కి పె ప్రభుత్వం పెంచింది.142 ఖ•దీ• కింద ఉన్న మొత్తం వైశాల్యం రాష్ట్ర భూభాగంలో 3% కంటే తక్కువగా ఉంది. కానీ అవి రాష్ట్ర జిడిపిలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయి.

పౌరుల జీవన నాణ్యత, సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న కృషికి గుర్తింపుగా వరుసగా 6 సంవత్సరాలుగా ‘‘జీవన నాణ్యత సూచిక’’లో దేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ ‌నిలిచింది..అలాగే కొనుగోలు శక్తి, భద్రత, ఆరోగ్య సంరక్షణ, జీవన వ్యయ, ఆస్తి ధర నుండి ఆదాయ నిష్పత్తి, వాతావరణ సూచికలో హైదరాబాద్‌ ‌నంబర్‌ ‌వన్‌గా కొనసాగుతున్నది.

జీవన నాణ్యత, ఆర్థిక పోటీతత్వానికి సంబంధించి ప్రపంచంలోని మొదటి 30 ఉత్తమ నగరాల్లో హైదరాబాద్‌ను చేర్చుటకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది.

2021లో 24312 యూనిట్ల అమ్మకాలలో 142% వృద్ధితో హైదరాబాద్‌ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రెసిడెన్షియల్‌ ‌మార్కెట్‌గా నిలిచింది.

ఈ అంశంలో 2014 నుంచి ఒక్క సంవత్సరం కూడా ధర తగ్గని నగరం దేశంలోని 8 మెట్రోలలో హైదరాబాద్‌ ‌మాత్రమే. ఒక చ.అడుగు కి రూ.4,450 సగటు రేటుతో మొదటి ఏడు మెట్రోలలో సరసమైన నివాస నగరంగా హైదరాబాద్‌ ‌కొనసాగుతున్నది.గత సంవత్సరం స్థూల ఆఫీస్‌ ‌స్పేస్‌ ‌పరంగా భారతదేశపు టాప్‌ ‌కమర్షియల్‌ ‌రియల్‌ ఎస్టేట్‌ ‌డెస్టినేషన్‌గా హైదరాబాద్‌ ‌నిలిచింది. అర్బన్‌ ఇ‌న్ఫ్రాస్ట్రక్చర్‌ ‌డెవలప్మెంట్‌ ‌ప్రోగ్రామ్‌ ‌లో భాగంగా ఎస్‌ ఆర్‌ ‌డీ పీ కింద రూ.671.19 కోట్లు, సీఆర్‌ ఎం‌పీ కింద రూ.293.93 కోట్లు, హెచ్‌ ఆర్‌ ‌డీ సీ ఎల్‌ ‌కింద రూ.114.97 కోట్లు ఖర్చుతో మౌళిక వసతుల పనులు ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే ఎస్‌ ఎన్‌ ‌డీ పీ కింద రూ.735 కోట్లతో +•వీ• జీ హెచ్‌ ఎం ‌సీ పరిధిలో 37 పనులు, రూ 231 కోట్లతో శివారు మున్సిపాలిటీలలో 21 పనులు చేపట్టడం జరిగింది.

యు ఎల్‌ ‌బీ లలో పారిశుధ్యం మరియు మౌలిక సదుపా యాలను మెరుగుపరిచే లక్ష్య ంతో పట్టణ ప్రగతి కార్యక్రమం కింద రూ.3,434 కోట్లు ప్రభుత్వంమంజూరు చేసింది. ప్రభుత్వం ప్రతినెల ఇస్తున్న నిధులతో మౌళిక సదుపా యాలు, పారిశుధ్య పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. కొత్తగా 2254 అదనపు పారిశుద్ధ్య వాహనాల కొనుగోలుతో జీహెచఎంసీ మినహా యు ఎల్‌ ‌బీ లలో మొత్తం శానిటేషన్‌ ‌వాహనాలు సంఖ్య 4882 లకు చేరింది. రోజుకు 4,295 గార్బెజ్‌ ‌సేకరిస్తున్నారు. యు ఎల్‌ ‌బీలలో చేపట్టిన 139 ఇంటిగ్రేటెడ్‌ ‌వెజ్‌ • ‌నాన్‌ ‌వెజ్‌ ‌మార్కెట్లలో 103 చోట్ల నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి.139 యు ఎల్‌ ‌బీ ఎస్‌లో 734 కొత్త వైకుంఠధామముల అభివృద్ధి పనులు చేపట్టారు.రూ.100.22 కోట్లతో మొత్తం ఓ ఆర్‌ ఆర్‌ ‌స్ట్రెచ్‌, అన్ని కూడళ్లు మరియు ముఖ్యమైన సర్వీస్‌ ‌రోడ్ల ఎల్‌ ఈ ‌డీ స్ట్రీట్‌ ‌లైటింగ్‌ను పూర్తి చేయడం జరిగింది. వేగవంతమైన అభివృద్ధి, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నానక్రామ్‌గూడ నుండి టీ ఎస్‌ ‌పీ ఏ వరకు, ఓ ఆర్‌ ఆర్‌, ‌నార్సింగి నుండి కొల్లూరు వరకు ఉన్న సర్వీస్‌ ‌రోడ్డును ప్రస్తుతం ఉన్న రెండు-లేన్ల రహదారి నుండి 4 లేన్‌లుగా విస్తరిస్తున్నారు. రూ.312 కోట్లుతో అదే మార్గంలో, సోలార్‌ ‌ప్యానెల్‌ ‌పైకప్పులతో 21-కిమీ పొడవైన సైక్లింగ్‌ ‌ట్రాక్‌ ‌కూడా నిర్మించబడుతోంది. దీనిని 42 కిమీ సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తున్నారు.జవహర్‌నగర్‌లో ప్రస్తుతం ఉన్న 19.8 మెగావాట్ల వేస్ట్ ‌టు ఎనర్జీ ప్లాంట్‌ ‌సామర్థ్యాన్ని 48 మెగావాట్లకు పెంచుతున్నారు. దీనికి అవసరమైన అనుమతులు మంజూరు చేయబడ్డాయి.

ఇది కాకుండా, దుండిగల్‌లో 14.5 మెగావాట్ల కొత్త డబ్ల్యుటిఇ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఫతుల్లాగూడలో 500 టీ పీ డీసామర్థ్యం గల రెండవ సీ అండ్‌ ‌డీ వేస్ట్ ‌రీసైక్లింగ్‌ ‌ప్లాంట్‌ ‌ప్రారంభించబడింది. దీనితో, హైదరాబాద్‌లో ఇప్పుడు రెండు 500 టీ పీ డీ , సీ అండ్‌ ‌డీ రీసైక్లింగ్‌ ‌ప్లాంట్లు ఉన్నాయి.•వీఔ••దీ హైదరాబాద్‌లో మురుగునీటి శుద్ధి సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 772 ఎం ఎల్‌ ‌డీ నుండి 2029 ఎం ఎల్‌ ‌డీ కి పెంచడానికి మరియు వ్యర్థాలను 100% శుద్ధి చేసేలా 31 ఎస్‌ ‌టీ పీ ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఫేజ్‌-1‌లో, 883 ఎం ఎల్‌ ‌డీ సామర్థ్యంతో 14 ఎస్‌ ‌టీ పీ ల పనులు ప్రారంభించబడ్డాయి. క్యాపిటల్‌ ఇం‌టెన్సివ్‌ ‌పనులను చేపట్టేందుకు జీ హెచ్‌ ఎం ‌సీ రూ.5983 కోట్ల విలువైన రుణాలను పొందగలిగింది. జీ హెచ్‌ ఎం ‌సీ ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేసిన తర్వాత బ్యాంకులు నుంచి రూ.2000 కోట్లను రాష్ట్ర గ్యారెంటీ లేకుండానే పొందడం జరిగింది . జీహెచ్‌ఎం‌సీ తన సొంత వనరులతో రూ. 8,965.కోట్ల విలువైన పనులను చేపడుతోంది. హైదరాబాద్‌లో క్లిష్టమైన మిస్సింగ్‌ ‌లింక్‌ ‌రోడ్‌లను విజయవంతంగా పూర్తి చేసి అన్ని ప్రాంతాలను సులభ రవాణా మార్గాలుగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది .ప్రణాళికాయుతంగా ప్రభుత్వం చేపడుతున్న పనులతో తెలంగాణ నగరాలు, పట్టణాలు నేడు ఆర్ధికవృద్ధికి,ఉత్పత్తికి, ఉపాధికి అనువైన నిలయాలుగా విస్తరిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *