తెలంగాణ కోటి ఎకరాల మాగాణం..!

(దశాబ్ది తెలంగాణ సంబురాల సందర్భంగా)
దేశవ్యాప్తంగా అనేక ఇంజనీరింగ్‌ అద్భుతాలు భారత మానవాళికి అమూల్య సేవలను అందిస్తూనే ఉన్నాయి. వీటిలో దేశం గర్వించగల లాంగెస్ట్, ‌లార్జెస్ట్, ‌బిగ్గెస్ట్ ఇం‌జనీరింగ్‌ ‌మార్వెల్‌గా నిలిచిన ‘కాళేశ్వరం లిఫ్ట్ ఇ‌ర్రిగేషన్‌ ‌ప్రాజెక్టు (కెయల్‌ఐపి)’ తెలంగాణకే లైఫ్‌లైన్‌గా నిలబడింది.

తెలంగాణ లైఫ్‌లైన్‌ – ఇం‌జనీరింగ్‌ ‌మార్వెల్‌:
             ‌భారత అత్యంత యువ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది వరద నీటిని 180 టియంసి వరకు ఎత్తి పోసే ప్రపంచ అతి పెద్ద మల్టీ-స్టేజ్‌ ‌లిఫ్ట్ ఇ‌ర్రిగేషన్‌ ‌ప్రాజెక్ట్‌తో తెలంగాణ నుంచి కరువుకాటకాలను తరిమేస్తూ, 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో నిర్మితమై, ‘రైస్‌ ‌బౌల్‌ ఆఫ్‌ ఇం‌డియా’గా నిలుస్తూ, ‘బంగారు తెలంగాణ’ నిర్మాణంలో ప్రధాన భూమికను నిర్వహిస్తూ, ‘తెలంగాణ లైఫ్‌లైన్‌’‌గా కాళేశ్వరం ఎత్తి పోతల పథకం సగర్వంగా నిలుస్తున్నది. రూ. 80,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం నుంచి మ్నెదలై ఎల్లంపల్లి శ్రీపాద సాగర్‌ ‌బ్యారేజ్‌ ‌మీదుగా కొండపోచమ్మ సాగర్‌ ‌వరకు సాగిన గోదారి నీటి పరుగుల పథకం నేటి ఆధునిక డిజిటల్‌ ‌యుగంలో ‘ఇంజనీరింగ్‌ ‌మార్వెల్‌’‌గా నిలుస్తున్నది. అత్యంత పొడవు, అతి పెద్ద ఇర్రిగేషన్‌ ‌వ్యవస్థగా 1,832 కిమీ దూరం 1,531 కిమీ గ్రావిటీ కెనాల్‌, 203 ‌కిమీ టనెల్స్‌తో 20 లిఫ్టులు, 22 పంప్‌ ‌హౌజులు, 120 భారీ పంపులతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అద్భుత సివిల్‌ ఇం‌జనీరింగ్‌ ‌కట్టడంగా నిలుస్తున్నది. ప్రతి 3 టియంసీలకు 7,700 యండబ్ల్యూ (7.7 గీగా వాట్‌) ‌పవర్‌ ‌వినియోగించుకునే లిఫ్ట్ ‌పంపులు, 20 కొత్త రిజర్వాయర్లు, 5 పాత రిజర్వాయర్లు కలుపుకొని 147.71 టియంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 37.08 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే నిర్మాణాలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఇప్పటి వరకు అతి పెద్ద లిఫ్ట్ ‌ప్రాజెక్టులుగా  అమెరికా కొలరాడో లిఫ్ట్ ‌స్కీమ్‌, ఈజిప్ట్‌లో గ్రేట్‌ ‌మ్యాన్‌మేడ్‌ ‌రివర్‌లు పేరు పొందగా, వాటిని అధిగమిస్తూ తెలంగాణ తల్లి బంగారు కంఠాభరణంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇ‌ర్రిగేషన్‌ ‌ప్రాజెక్టు మన కళ్ళ ముందు అద్భుత నిర్మాణంగా నిలుస్తున్నది.
తాగు, సాగు నీటి పథకాలు:
సాగు నీటికి తోడుగా పరిశ్రమలకు నీటి సరఫరా, హైదరాబాద్‌?‌కు తాగు నీరు అందించుట జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మిషన్‌ ‌భగీరథ, మిషన్‌ ‌కాకతీయ పథకాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల గుండా ఎల్లంపల్లి శ్రీరామ్‌ ‌సాగర్‌ ‌ప్రాజెక్టులను దాటుతూ వందల కిమీ పొడవున జలసిరులు అందించుటకు ఎల్లంపల్లి నుంచి మేడారం, రామడుగు, మిడ్‌మానేరు, అనంతగిరి, ఇమామాబాద్‌?, ‌మల్లన్నసాగర్‌లను దాటుతూ కొండపోచమ్మ వరకు గోదారి జలాలు గలగల పారుతూ, తెలంగాణ తల్లికి అందమైన హరిత వస్త్రాలను కప్పుతూ రైతుల పాలిట కల్పవృక్షంగా, ప్రజలందరికీ అక్షయపాత్రగా నిలుస్తున్నది. అతి తక్కువ సమయం తీసుకొని మెఘా ఇంజనీరింగ్‌ అం‌డ్‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ ‌కంపెనీ (యంఈఐయల్‌) ‌ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం లిఫ్ట్ ఇ‌ర్రిగేషన్‌ ‌ప్రాజెక్టులో ప్రపంచంలోనే అతి పెద్ద బాహుబళి పంప్‌ ‌హైజ్‌ ‌లక్ష్మీపూర్‌ ‌వద్ద స్థాపించబడింది. దిగువన ఉన్న కాళేశ్వరం నుంచి ఎగువన ఉన్న కొండపోచమ్మ సాగర్‌ ‌వరకు 618 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ ‌చేయడమనే అసాధ్య కలను సుసాధ్యంగా సాకారం చేసి చూపించడం మన కళ్ళ ముందే జరిగిపోయింది.  వరల్డ్ ‌లాంగెస్ట్, ‌లార్జెస్ట్, ‌బిగ్గెస్ట్ ఇం‌జనీరింగ్‌ ‌మార్వెల్‌ ‌మన తెలంగాణలో నిర్మించబడడం మనందరికీ గర్వకారణమే కాకుండా ప్రపంచ లిఫ్ట్ ఇ‌ర్రిగేషన్‌ ‌చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌సజీవ సాక్ష్యం, నిత్య సుభిక్షభరితం, భారతమాతకే ఆణిముత్యం.

image.png
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *