తెలంగాణ ఎన్నికల్లో విధాత కన్సల్టింగ్ కీలక పాత్ర

విధాత వ్యవస్థాపకుడు రాజ్ జనగాం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : తెలంగాణ ఎన్నికల్లో విధాత కన్సల్టింగ్ సంస్థ కీలక పాత్ర పోషించిందని విధాత సీఈఓ రాజ్ జనగాం అన్నారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేసి క్లయింట్లకు సమగ్ర విజయాలను అందించాలనేది సంస్థ ప్రాథమిక సూత్రం అని అన్నారు. అనుభవజ్ఞలైన ప్రశాంత్ నాంపల్లి, సతీష్ పెండ్యాల, చైతన్య కుమార్ ఇతర కీలక సభ్యులతో సహా అత్యంత ప్రతిభవంతులైన వారు తమ టీంలో పనిచేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో విధాత కన్సల్టింగ్ తన అగ్ర శ్రేణి ప్రచార నిర్వహణ సేవలను ఉపయోగించు కోవడానికి ఏపీ, తెలంగాణ నుండి రాజకీయ నాయకులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. విధాత కన్సల్టింగ్ ఇండియాలో అత్యధికంగా కోరుకునే పొలిటికల్ కన్సల్టింగ్ గా మార్చడమే లక్ష్యం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *