తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన తప్పా..

  • మన ఆకాంక్షలను సోనియమ్మ సాకారం చేయలేదా..
  • రుణం తీర్చుకోవాల్నా లేదా..
  • ఆవేదనతో ఈ ప్రశ్న అడుగుతున్నా
  • యాత్ర ఫర్‌ ‌ఛేంజ్‌ ‌పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి  

స్టేషన్‌ ‌ఘనపూర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : ‘‘తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన తప్పా. పదవుల కోసం కాదు ఆవేదనతో ఈ ప్రశ్న అడుగుతున్నా. తెలంగాణ ఇవ్వడమే మేము చేసిన ద్రోహమా. ఎందుకు కాంగ్రెస్‌ ‌పార్టీని గెలిపించరు. 140 కోట్ల మంది ప్రజల ముందు ఈవాళ తెలంగాణ సమాజం దోషిగా నిలబడింది. 1200 యువకుల బలిదానాలకు చలించి ఏ అమ్మకు కడుపు కోత ఉండకూడదని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. రాజకీయంగా నష్టపోయిన తెలంగాణకు కలను సాకారం చేశారు. అంతగొప్ప త్యాగం చేసే సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద లేదా అని ప్రశ్నిస్తున్నా. ’’ అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి యాత్ర ఫర్‌ ‌ఛేంజ్‌ ‌పాదయాత్రలో భాగంగా 11వ రోజు స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌నియోజకవర్గంలో 12 కిలోమీటర్ల మేర రేవంత్‌ ‌రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌లో నిర్వహించిన జనసభలో  రేవంత్‌ ‌రెడ్డి ప్రసంగించారు. ఈ నెల 6న సమ్మక్క-సారలమ్మల ఆశ్వీరాదంతో మొదలైన పాదయాత్ర మహబూబాబాద్‌ ‌పార్లమెంటు స్థానం పరిధిలో 100 కిలోమీటర్లు పూర్తి చేసుకొని వరంగల్‌ ‌పార్లమెంట్‌ ‌పరిధిలోకి వొచ్చింది. ఇప్పుడు స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌కు చేరింది.

శుక్రవారం రోజు జాఫర్‌ ‌గడ్‌ ‌కూనూరు గ్రామం నుంచి స్టేషన్‌ ‌ఘన్‌ ‌పూర్‌ ‌వరకు సాగిన పాదయాత్రను కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు విజయవంతం చేశారు. ఈ గడ్డకు గాలికి, నీరుకు గొప్ప చరిత్ర ఉంది. మహాకవి బమ్మెర పోతన, తెలంగాణ సాయుధ పోరాటంలో నిప్పు రవ్వ చాకలి ఐలమ్మ, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసి తెలంగాణ గడ్డపై దళిత, బహుజన, మైనార్టీలతో కలిసి ప్రజారాజ్యాన్ని నిర్మించిన సర్వాయి పాపన్న ఈ జిల్లాకు చెందిన వారే. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌లో అభివృద్ధి జరిగింది. స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ అం‌టే కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య గుర్తుకు వొస్తారు. లెక్చరర్‌గా పనిచేసి విద్య విలువ తెలిసిన కడియం శ్రీహరి.. స్టేషన్‌ ‌ఘనపూర్‌కు డిగ్రీ కాలేజీ తేలేకపోయారు. గతంలో కడియం కొంచెం పరువుగా బతికారు. రాజయ్య పంచెకట్టు కాంగ్రెస్‌లో చెల్లింది కానీ..దొర గడీలో చెల్లలేదు. ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య బర్తరఫ్‌ ‌తెలంగాణ చరిత్రలో ఒక మాయని మచ్చ. దళితులంటే చిన్నచూపు ఉన్న కేసీఆర్‌… అవినీతి ఆరోపణల పేరుతో ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ ‌చేశారు.

రాజయ్య నిజంగా అవినీతి చేసి ఉంటే ఎందుకు బయట పెట్టలేదు? దొరగడీలో చేరాక చచ్చిన పాము కంటే హీనంగా బానిసగా బతుకుతున్నారు. రాజయ్యకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్‌. ‌గాడిదకంటే హీనంగా దొరగారి దొడ్లో ఆయనకు అవమానం జరిగింది. గతంలో వరంగల్‌కు వైద్య విధాన పరిషత్‌ ‌తెస్తా అని ప్రకటించిన రాజయ్య..సొంత నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్‌ ‌తేలేకపోయాడు. కడియంతో పోలిస్తే కోవర్టు దయాకరరావుకు ఓనమాలు కూడా రావు. ఒకప్పుడు ఆత్మగౌరవంతో బతికిన కడియం శ్రీహరికి ఇంత అవమానం అవసరమా? మాదిగబిడ్డల పౌరుషం కడియంలో చచ్చిపోయిందా? పదవుల కోసం తాకట్టు పెట్టారా? ఒక్క మాదిగ సోదరుడిని కూడా కేసీఆర్‌ ‌మంత్రివర్గంలోకి తీసుకోలేదు. రాజకీయంగా నష్టపోయినా కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్‌ ‌కుబుంబం కోసమా తెలంగాణ వొచ్చింది.

మోసపూరిత హామీలతో కేసీఆర్‌ ‌రెండు సార్లు అధికారంలోకి వొచ్చారు. రబ్బరు చెప్పులు వేసుకొని తిరిగినోళ్లు, ఎమ్మెల్యేలు కోట్లకు అధిపతులయ్యారు. ఇవాళ ఆరూరి రమేష్‌కు భూమిలేని ఊరు ఉందా. ల్యాండ్‌ ‌మాఫియా, శాండ్‌ ‌మాఫియా, వైన్‌ ‌మాఫియా అంతా టీఆర్‌ఎస్‌ ‌నాయకులే. అఖరికి రేపు కేసుల్లో కూడా వాళ్లే ఉంటున్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తు కూర్చుందామా. దొరల గడీలు బద్ధలు కొట్టాల్సిన రోజుకు మళ్లీ వొచ్చాయి. ఎంఏ బీఈడీ చేసిన ఆడబిడ్డ చెప్పులు అమ్ముకునే దుర్భర పరిస్థితి రాష్ట్రంలో ఉంది. నోటిఫికేషన్లు లేక ఉద్యోగం రాక నిరుద్యోగుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. 2024, జనవరి1న కొత్త సంవత్సరంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉంటుంది. ధరణి రద్దు చేసే జీవో ఇస్తుంది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి వారిని ఆదుకుంటాం. పేదలకు వైద్యం అందించేందుకు 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ మార్జిన్‌ను 5 లక్షలకు పెంచుతాం. రైతులకు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అం‌దించే బాధ్యత మాది. జర్నలిస్టులకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలోనే న్యాయం జరిగింది.

కాంగ్రెస్‌ ‌గెలిస్తేనే పేదల బతుకులు బాగుపడతాయి. ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్‌ ‌సిలిండర్‌ అం‌దిస్తాం. ఇన్ని మంచి పనులు చేయాలంటే తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌ ‌జెండా ఎగరేయండి. ఈ హామీలు అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉంది. ఉచిత విద్యుత్‌, ఇం‌దిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ, రైతులకు రుణమాఫీ, జలయజ్ఞంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు కట్టింది, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవన్నీ కాంగ్రెస్‌ ‌పార్టీ చేసింది. ఇవన్నీ చేయడం తప్పా. అందుకే కాంగ్రెస్‌ ‌పార్టీని ఓడించారా. తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన తప్పా. 2014 నుంచి కేసీఆర్‌ 17 ‌లక్షల కోట్లవిలువైన తొమ్మిది బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 5 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆ లెక్కన ప్రతి నియోజకవర్గానికి రూ. 20 వేల కోట్లు రావాలి. మరీ స్టేషన్‌ ‌ఘన్‌ ‌పూర్‌కు ఆ మేరకు నిధులు వొచ్చాయా లేదో మీరే ఆలోచించండి. బీజేపీ అంటే ఆదానీ, అంబానీ పార్టీ. టీఆర్‌ఎస్‌ ‌దొరలు, కంట్రాక్టర్ల పార్టీ. కాంగ్రెస్‌ అం‌టే పేదోళ్ల పార్టీ. పేదోళ్ల కష్టాలు కాంగ్రెస్‌ ‌పార్టీకి మాత్రమే తెలుసు. కాబట్టి కాంగ్రెస్‌ ‌పార్టీని గెలిపించండి. తెలంగాణలో పేదోళ్ల రాజ్యం తెచ్చుకుందామని రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *